iDreamPost
android-app
ios-app

కూలీ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా !

  • Published Aug 21, 2025 | 4:08 PM Updated Updated Aug 21, 2025 | 4:08 PM

రజినీకాంత్ , లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి.. రిలీజ్ కు ముందు వరకు కూడా విపరీతమైన హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య లాంగ్ వీకెండ్ చూసుకుని మరీ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఓపెనింగ్స్ కూడా అంతే గ్రాండ్ గా వచ్చాయి.

రజినీకాంత్ , లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి.. రిలీజ్ కు ముందు వరకు కూడా విపరీతమైన హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య లాంగ్ వీకెండ్ చూసుకుని మరీ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఓపెనింగ్స్ కూడా అంతే గ్రాండ్ గా వచ్చాయి.

  • Published Aug 21, 2025 | 4:08 PMUpdated Aug 21, 2025 | 4:08 PM
కూలీ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా !

రజినీకాంత్ , లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి.. రిలీజ్ కు ముందు వరకు కూడా విపరీతమైన హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య లాంగ్ వీకెండ్ చూసుకుని మరీ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఓపెనింగ్స్ కూడా అంతే గ్రాండ్ గా వచ్చాయి. అయితే ఇన్ని అంచనాల మధ్యన సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు మాత్రం.. పూర్తి శాటిస్ఫ్యాక్షన్ తో బయటకు రాలేదన్న మాట వాస్తవం. కానీ మొదటి రోజు దాటినా తర్వాత టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు వసూళ్ల మోత మోగించింది కూలీ.

అయితే వీక్ డే మొదలైన తర్వాత మాత్రం కూలి సైతం డ్రాప్ చూడక తప్పలేదు. ఇది అందరు ఊహించిందే కానీ.. మరీ ఇంత పడిపోతుందని మాత్రం అనుకోలేదు. ఏకంగా ఒకేసారి ఆక్యుపెన్సీ 10-15 % కు పడిపోయింది. ఆదివారం హౌస్ ఫుల్ తర్వాత సోమవారం ఒకేసారి థియేటర్ లో ఎంప్టీ సీట్స్ దర్శనం ఇచ్చాయి. ఒక్క తెలుగులోనే కాదు తమిళం , హిందీ ఇలా అన్ని భాషలలోను కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వీకెండ్స్ లో ఒక్కో రోజు 60 కోట్లకు పైగా రాబట్టిన సినిమా.. ఇప్పుడు పది కోట్లు రాబట్టడానికి కూడా కష్టం అవుతుంది.

దీనితో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనుకుంటున్నారు మేకర్స్. చూస్తుంటే కొన్ని చోట్ల నష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా పడిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వీకెండ్ వరకు అయితే కనీసం 50 % ఆక్యుపెన్సీతో సినిమా రన్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.