ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు హాజరు కాగా రాబోయే రోజుల గురించి చర్చలు జరిగాయి. అక్కినేని నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, త్రివిక్రమ్, కొరటాల శివ, చినబాబు, దిల్ రాజు, సి కళ్యాణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. షూటింగులు ఆగిపోవడం వల్ల 14 వేల కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందనే దాని గురించి చిరంజీవి ప్రస్తావించగా గవర్నమెంట్ తరఫున చెప్పబట్టబోయే […]
ఇవాళ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ వీడియో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే తారక్ సిక్స్ ప్యాక్ పిక్ ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ స్వంతంగా చేసుకున్న ఏవీలతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. వీళ్ళే ఇలా చేస్తే ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ గా భావించే తాను ఇంకెంత స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలో గుర్తించిన మెగా పవర్ స్టార్ […]
వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ని చూడబోతున్నాం అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్తలే గత రెండు మూడు రోజులుగా షికారు చేస్తున్నాయి. రేపు ఆశించిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వీడియో ఇవ్వడం లేదని ఆల్రెడీ చెప్పేశారు. మరోవైపు షూటింగ్ అయ్యాక కూడా ఇంకా చాలా పనులున్నాయని టార్గెట్ రీచ్ కావడం కష్టమే అన్నట్టుగా దానయ్య చెప్పిన మాటలు మీడియాలో తెగ షికారు చేశాయి. అయితే డివివి సంస్థ […]
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమనే టార్గెట్ ని అందుకోవడమే కష్టంగా మారిన తరుణంలో ఇటీవలే ఓ టీవీ వీడియో కాల్ ఇంటర్వ్యూలో రాజమౌళి తాను త్వరలో ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించడం అభిమానులకు ఒక పక్క సంతోషాన్ని మరోపక్క ఆందోనళను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే జక్కన్న తీసుకునే టైం. బాహుబలి రెండు భాగాలకు ఐదేళ్లు పట్టింది. ఎంత ప్లానింగ్ తో ఆర్ఆర్ఆర్ స్టార్ట్ చేసినా […]
కరోనా వల్ల షూటింగులు లేక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఆగిపోయి నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. రానున్న రోజుల్లో కాస్ట్ కటింగ్ తప్పదని రాజమౌళి, సురేష్ బాబు లాంటి దిగ్గజాలు ఇప్పటికే రాబోయే రోజులను ఊహించి చెబుతున్నారు. ఒకవేళ ఈ విషయంలో రాజీ పడకపోతే భవిష్యత్ పరిణామాలు కష్టంగా మారే అవకాశం ఉందని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఎప్పటిలాగే పరిస్థితి పూర్తిగా కంట్రోల్ లోకి రావడానికి ఎంత లేదన్నా ఏడాదిపైనే పడుతుంది. అందులోనూ థియేటర్లు, […]
టాలీవుడ్ కు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ ఒక బంగారు బాతు లాంటిది. స్టార్లు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు రెండు మూడైనా ఈజీగా వర్కౌట్ చేసుకుని వందల కోట్ల వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ ఒక్క ఈ సీజన్ కే ఉంటుంది. అందుకే ఆరేడు నెలల ముందే తమ ప్రాజెక్ట్స్ ఆ తేదీకి వచ్చేలా పెద్ద హీరోల నిర్మాతలు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మరీ గొప్పగా లేని కంటెంట్ తో వచ్చిన భోగి మూవీస్ ఈ ఏడాది […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ పడి ఇంట్లోనే లాక్ డౌన్ టైంని ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ నెల 20న రాబోతోంది. ఆ రోజు రాజమౌళి ఏదైనా వీడియో గిఫ్ట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా తారక్ కు ఓ బాలీవుడ్ ఆఫర్ సిద్ధంగా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. అందులో అంతగా ఆశ్చర్యపోవడానికి ఏముందనకండి. ఎందుకంటే […]
ఎప్పుడో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ హయంలో చూసిన మల్టీ స్టారర్స్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రాలు టాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. కొంత వరకు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులు కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు కానీ చిరంజీవి తరం నుంచి ఇవి పూర్తిగా ఆగిపోయాయి. రాజమౌళి పుణ్యమాని ఆర్ఆర్ఆర్ రూపంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చూడబోతున్నాం కానీ లేదంటే ఇది […]
ఇటీవలే రాజమౌళి ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు సాధించిన కొరియన్ సినిమా పారసైట్ తనకు నచ్చలేదని, చూస్తూ టీవీ కట్టేయబోయే ముందు చాలాసేపు నిద్రపోయానని చెప్పారు. ఇందులో తప్పేమి లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సదరు మూవీ నచ్చాలన్న రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే నిజంగా ఆ పురస్కారాన్ని అందుకున్న ఎన్నో సినిమాలు మనం అంత ఓపిగ్గా చూడలేం. ఇక్కడి అభిరుచులు, స్టాండర్డ్ […]
నిన్న ఓ న్యూస్ ఛానల్ కు గంటకు పైగా రాజమౌళి ఇచ్చిన సెల్ఫీ వీడియో ఇంటర్వ్యూలో ఎక్కువ శాతం కరోనా గురించే చర్చ జరిగినప్పటికీ ఆర్ఆర్ఆర్ విశేషాలు కూడా బాగానే చర్చకు వచ్చాయి. అసలు ఆర్ఆర్ఆర్ ఆలోచన ఎలా వచ్చిందన్న దానికి జక్కన్న ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మధుబాబు, పానుగంటి, కొమ్మినేని లాంటి సుప్రసిద్ధ క్రైమ్ థ్రిల్లర్ నవలల్లో షాడో, బుల్లెట్ లాంటి పాత్రలు తనను విపరీతంగా ఆకట్టుకునేవని […]