iDreamPost
android-app
ios-app

తారక్ కు బాలీవుడ్ షాకింగ్ ఆఫర్ ?

  • Published May 02, 2020 | 8:59 AM Updated Updated May 02, 2020 | 8:59 AM
  • Published May 02, 2020 | 8:59 AMUpdated May 02, 2020 | 8:59 AM
తారక్ కు బాలీవుడ్ షాకింగ్ ఆఫర్ ?

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ పడి ఇంట్లోనే లాక్ డౌన్ టైంని ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ నెల 20న రాబోతోంది. ఆ రోజు రాజమౌళి ఏదైనా వీడియో గిఫ్ట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా తారక్ కు ఓ బాలీవుడ్ ఆఫర్ సిద్ధంగా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. అందులో అంతగా ఆశ్చర్యపోవడానికి ఏముందనకండి. ఎందుకంటే ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి.

వాటి ప్రకారం అందులో మొదటిది భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత కం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఈ ప్రపోజల్ రావడం. కల్ట్ క్లాసిక్స్ అనిపించుకునే స్థాయిలో ఈయన తీసిన పద్మావత్, బాజీరావు మస్తానీ, రామ్ లీలా, హమ్ దిల్ చుకే సనమ్, దేవదాస్ ఎంత సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రానికి ఆయన ప్లాన్ చేసుకున్నారట. అందులో రన్వీర్ సింగ్ హీరో. మరి జూనియర్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారా అనే అనుమానం వద్దు. ఎందుకంటే భన్సాలీ తారక్ కోసం సెట్ చేసింది విలన్ రోలట.

చాలా పవర్ ఫుల్ గా ఉంటూనే హీరోతో సమాంతరంగా ఉండేలా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దారట. పద్మావత్ లో హీరో షాహిద్ కపూర్ కంటే విలన్ రన్వీర్ సింగ్ కే ఎక్కువ పేరొచ్చిన సంగతి తెలిసిందే. అలా ఉంటుంది భన్సాలీ స్టైల్. జై లవకుశలో రావణగా తారక్ యాక్షన్ చూశాకే భన్సాలీకి ఈ ఆలోచన వచ్చిందట. మరి ఈ ప్రతిపాదన జూనియర్ ఎన్టీఆర్ ఎంతమేరకు ఒప్పుకుంటాడా వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ న్యూస్ అయితే గట్టిగానే ప్రచారంలో ఉంది. ఆర్ఆర్ఆర్ బాలన్స్ షూటింగ్ కోసం ఇంకొద్ది రోజులు కేటాయిస్తే ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో బిజీ అయిపోతాడు తారక్. ఆలోగా ఇక్కడ చెప్పిన బాలీవుడ్ ఆఫర్ కు సంబంధించిన క్లారిటీ రావొచ్చు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetganobetbetciojojobetgrandpashabet girişcasibom