iDreamPost
iDreamPost
ఇటీవలే రాజమౌళి ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు సాధించిన కొరియన్ సినిమా పారసైట్ తనకు నచ్చలేదని, చూస్తూ టీవీ కట్టేయబోయే ముందు చాలాసేపు నిద్రపోయానని చెప్పారు. ఇందులో తప్పేమి లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సదరు మూవీ నచ్చాలన్న రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే నిజంగా ఆ పురస్కారాన్ని అందుకున్న ఎన్నో సినిమాలు మనం అంత ఓపిగ్గా చూడలేం. ఇక్కడి అభిరుచులు, స్టాండర్డ్ ప్రపంచ స్థాయికి కొంత భిన్నంగా ఉండటం కారణం.
సరే దీని సంగతలా ఉంచితే రాజమౌళి ఇలా చెప్పడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. పారసైట్ మీకు ఎలా నచ్చలేదు, అసలు మీ సినిమాలు చూస్తూ ఎందరు నిద్రపోయారో తెలుసా అంటూ ఇలా రకరకాలుగా జక్కన్నకు టార్గెట్ చేసేశారు. కొందరు ఓ అడుగు ముందుకు వేసి మీ బాహుబలి కూడా స్లీపింగ్ పిల్ లాంటి సినిమానే అనేశారు. ఇక్కడ రాజమౌళి అన్నది తప్పా కాదా అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా కాదు. ఒకవేళ పారసైట్ ని బాహుబలితో పోలిస్తే కంటెంట్ పరంగానూ అంతర్జాతీయ స్థాయిలో స్పందనలోనూ జక్కన్న సినిమానే ఒక మెట్టు పైన ఉంటుంది .
అలా అని పారసైట్ ని ఇక్కడ తక్కువ చేయడం లేదు. వరల్డ్ ఇంటలెక్చువల్స్ ని మెప్పించిన చిత్రంగా ఇది అన్ని విధాలుగా ప్రశంశలకు అర్హత ఉన్నదే. ఇదే పారసైట్ ని తెలుగులో డబ్బింగ్ చేసి బిసి సెంటర్స్ లో వదిలితే ఇక్కడ ఆడుతుందా. కాని బాహుబలి జపాన్ కూడా జయకేతనం ఎగరేసింది. పారసైట్ ఇండియాలో సైతం అద్భుతంగా ఉందన్న వాళ్ళు ఉన్నారు, ఇదేం సినిమా దీనికా ఇంత రేంజ్ బిల్డప్ ఇచ్చారని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రాజమౌళి కూడా తనకున్న స్వేచ్చలో పారసైట్ గురించి ఇదే అన్నారు. అంత మాత్రాన ఇలా టార్గెట్ చేసి ఆస్కార్ ని ఉన్నతంగా చూపడం కోసం మన దర్శకులను తక్కువ చేసుకోవడం ఏమిటో