iDreamPost
iDreamPost
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయినా మరోవైపు వర్క్ ఫ్రొం హోం తరహలో కీరవాణి తదితరులు దీనికి సంబంధించిన కీలక వ్యవహారాల్లో బిజీగానే ఉన్నారట. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ లో అసలు ఎన్ని పాటలు ఉంటాయనే అనుమానం ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో ఉంది. లీకైన తాజా డేట్ ప్రకారం ఇందులో చిన్నవి పెద్దవి అన్ని కలిపి 10 ట్రాక్స్ ఉంటాయని తెలిసింది. ఇది అధికారికంగా చెప్పింది కాకపోయినా బయటికి వచ్చిన సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది.
వీటిలో 5 పాటల్లో తారక్ చరణ్ లు కలిసే కనిపిస్తారని మరో న్యూస్. అయితే వీటిలో డ్యూయెట్స్ ఏవో హీరొయిన్ తో కాంబినేషన్ సాంగ్స్ ఏవో లాంటి విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక నిడివికి సంబంధించి కూడా మరో వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా రఫ్ కట్ వెర్షన్ నాలుగు గంటల దాకా వస్తోందట. అయితే దాన్ని 3 గంటలకు కుదించేలా ప్లానింగ్ చేస్తున్నారట. కరోనా వల్ల షూటింగులన్ని వాయిదా పడటంతో పరిశ్రమ మొత్తం స్థంబించిపోవడంతో వచ్చే ఏడాది జనవరి 8కి ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందా లేదా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి.
ఒకవేళ వాయిదా తప్పకపోతే 2021 సమ్మర్ కు వెళ్ళక తప్పదు. బాహుబలి డేట్ ని వాడుకోవాల్సి రావొచ్చు. ఇంకో నెల రెండు నెలలు ఆగితే కాని ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ గురించి క్లారిటీ రాకపోవచ్చు. నిర్మాత దానయ్య మాత్రం చెప్పిన తేదికి వస్తామని నమ్మకంగా అంటున్నారు కాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు మాత్రం దానికి అనుకూలంగా లేవు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఆర్ఆర్ఆర్ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందట. ఇప్పటికే చాలా ఏరియాలకు బిజినెస్ పూర్తి చేసుకున్నట్టుగా చెబుతున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మీద ఇతర స్టార్ల ప్లానింగ్ ఆధారపడి ఉంది.