iDreamPost
android-app
ios-app

RRRలో మరో థ్రిల్లింగ్ స్టార్ ?

  • Published Mar 29, 2020 | 5:40 AM Updated Updated Mar 29, 2020 | 5:40 AM
RRRలో మరో థ్రిల్లింగ్ స్టార్ ?

నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియో టీజర్ ఆన్ లైన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో ఓ రేంజ్ లో ఉన్న ఈ ప్రోమో ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్ ఇచ్చేసింది. ఇక మేలో రాబోతున్న యంగ్ టైగర్ బర్త్ డే కోసం అభిమానులు ఇప్పటినుంచే ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో ఆకర్షణలు జత చేసుకున్న ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో సూపర్ స్కెచ్ సిద్ధం చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.

దాని ప్రకారం ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ స్పెషల్ క్యామియో చేయించే ప్రతిపాదన ఉందట. చాలా కీలకంగా అనిపించే పాత్ర కనిపించేది కాసేపే అయినా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ విజయ్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ని జక్కన్న ఓ రేంజ్ లో డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. ప్రపోజల్ అయితే విజయ్ వద్దకు వెళ్ళింది కాని అతను ఒప్పుకున్నాడో లేదో ఇంకా తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే తమిళ మార్కెట్ పరంగా ఆర్ఆర్ఆర్ ఇంకో పెద్ద అడ్వాన్టేజ్ తోడవుతుంది. అయితే విజయ్ ఇలా కనిపించడం చాలా అరుదు.

అప్పుడెప్పుడో ప్రభుదేవా హిందిలో తీసిన రౌడీ రాథోడ్ కోసం ఓ పాటలో కనిపించి వెళ్ళిపోతాడు తప్ప ఫుల్ లెంత్ క్యామియో చేయలేదు. ఇప్పుడు రాజమౌళి అడిగాడు కాబట్టి ఒప్పుకోవచ్చేమో అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కరోన వల్ల షూటింగులు, రిలీజులు. అప్ డేట్లు అన్ని ఆగిపోయాయి కనక ఇప్పటికిప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ అప్ డేట్ గురించి ఖచ్చితంగా చెప్పలేం కాని ఇంకొద్ది రోజులు అయ్యాక క్లారిటీ వస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు ఇంకే అవాంతరాలు రాకపోతే అనుకున్న టైంకే విడుదలవుతుంది.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet