iDreamPost

‘మా’ అసోసియేషన్ నుంచి హేమ సస్పెండ్.. మంచు విష్ణు సంచలన నిర్ణయం

Hema Suspension: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్లు రావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

Hema Suspension: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్లు రావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

‘మా’ అసోసియేషన్ నుంచి హేమ సస్పెండ్.. మంచు విష్ణు సంచలన నిర్ణయం

బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతం ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ సహా 80 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన బెంగళూరు పోలీసులు వారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. అందరికీ నోటీసులు పంపించారు. హేమకి  కూడా నోటీసులు పంపించారు. అయితే తనకు ఆరోగ్యం బాలేదని విచారణకు రాలేనని హేమ తెలిపింది. ఆ తర్వాత మరోసారి నోటీసులు పంపించారు. అయినప్పటికీ హేమ స్పందించకపోవడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు పోలీసులు. ఆమె ఇంట్లో విచారణ జరిపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి బెంగళూరు తీసుకెళ్లారు. కాగా ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెబుతుంది.

ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సినీ నటి కరాటే కళ్యాణి సైతం హేమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి వారిని మా అసోసియేషన్ లో ఉంచకూడదని.. వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. తాజాగా హేమ సస్పెన్షన్ అంశాన్ని మా ప్రెసిడెంట్, హీరో విష్ణు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురి డిమాండ్ మేరకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్ లో హేమ డ్రగ్స్ కేసుకి సంబంధించి సభ్యుల అభిప్రాయాలను కోరుతూ మెసేజ్ చేశారట.

స్పెండ్ చేయడంపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని మంచు విష్ణు కోరగా.. మెజారిటీ శాతం హేమను సస్పెండ్ చేయాలంటూ సమాధానమిచ్చారట. దీంతో మంచు విష్ణు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హేమను మా నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ సస్పెన్షన్.. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకూ ఉంటుందని టాక్. క్లీన్ చీట్ వచ్చేంత వరకూ హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారట. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే ఇక ఎప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతుందని అంటున్నారు. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి