iDreamPost

ఫోటోలో క్యూటీ.. కానీ సినిమాల్లో మాత్రం ఫుల్‌ హాట్‌ ఈ బ్యూటీ.. ఎవరో తెలుసా!

  • Published Jun 28, 2024 | 2:14 PMUpdated Jun 28, 2024 | 2:14 PM

పైన ఫొటోలో.. పోలీసు అధికారి చేతిలో కూర్చొని.. చిరు నవ్వులు చిందిస్తోన్న క్యూటీ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌ బ్యూటీగా మారింది. ఇంతకు తను ఎవరో గుర్తు పట్టారా...

పైన ఫొటోలో.. పోలీసు అధికారి చేతిలో కూర్చొని.. చిరు నవ్వులు చిందిస్తోన్న క్యూటీ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌ బ్యూటీగా మారింది. ఇంతకు తను ఎవరో గుర్తు పట్టారా...

  • Published Jun 28, 2024 | 2:14 PMUpdated Jun 28, 2024 | 2:14 PM
ఫోటోలో క్యూటీ.. కానీ సినిమాల్లో మాత్రం ఫుల్‌ హాట్‌ ఈ బ్యూటీ.. ఎవరో తెలుసా!

పైన ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ.. నాన్న కూచిలా ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా లేదా.. ఇప్పుడు తన పాన్‌ ఇండియా హీరోయిన్‌. చిన్న బడ్జెట్‌ సినిమాలో నటించి.. ఊహించని రీతిలో పాన్‌ ఇండియా స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్‌, నార్త్‌లో ఈ బ్యూటీ క్రేజ్‌ పెరిగిపోయింది. కథ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌గా కూడా నటిస్తుంది. దాంతో ఈ అమ్మడి కెరీర్‌ ఎక్కడికో వెళ్తుంది అని అంతా భావించారు. కానీ అలా ఏం జరగలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ బ్యూటీ మాత్రం లైమ్‌లైట్‌లోనే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలతో ఈ మధ్యనే కోర్టుకు ఎక్కింది. ఇంతకు ఈ క్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా.. లేదా.. అయితే ఇది చదవండి. ఆ బ్యూటీ ఎవరో తెలుసుకొండి.

పైన ఫొటోలో పోలీస్‌ ఆఫీసర్‌ చేతిలో కూర్చుని.. చక్కగా చిరునవ్వులు చిందిస్తోన్న ఈ క్యూటీని మీరు ఇంకా గుర్తుపట్టలేదా. తను కాంతారా బ్యూటీ, కన్నడ కస్తూరి సప్తమి గౌడ. ఈ బ్యూటీ ముందుగా మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం అనగా 2020లో యాక్షన్ థ్రిల్లర్ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ అనే చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిందీ బ్యూటీ. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్లకు రిషబ్ శెట్టితో నటించిన ‘కాంతారా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సప్తమి గౌడ. కన్నడ భాషలో చిన్న సినిమాగా విడుదలై.. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ డబ్ అయ్యి.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌ డూపర్‌ హిట్టు మూవీగా నిలిచింది కాంతారా సినిమా.

కాంతారా హిట్టుతో సప్తమి గౌడ క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అమాంతం పెరిగింది. ఇక గతేడాది ‘ది వ్యాక్సిన్ వార్’, ‘యువ’ సినిమాల్లో నటించింది. కానీ ఆ రెండు చిత్రాలు ఆశించిన మేర రాణించలేదు. ఇక ఇటీవల నితిన్ హీరోగా నటిస్తోన్న ‘తమ్ముడు’ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది సప్తమి గౌడ. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక సినిమాల సంగతి అలా ఉంచితే.. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు.. తన సినిమా అప్‌డేట్స్.. అలాగే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. ఈమధ్యకాలంలో ఓ వివాదంలో ఇరుక్కుంది సప్తమి గౌడ. కన్నడ హీరో యువరాజ్‌తో సప్తమి గౌడకు రిలేషన్‌ ఉందని.. ఆ హీరో భార్య ఆరోపించడం సంచలనంగా మారింది. దాంతో ఈ ఆరోపణలపై సప్తమి గౌడ కోర్టును ఆశ్రయించింది.

 

View this post on Instagram

 

A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి