iDreamPost

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీపిక కాస్ట్యూమ్స్ ధర తెలిస్తే షాక్..!

  • Published Jun 28, 2024 | 1:41 PMUpdated Jun 28, 2024 | 1:41 PM

ఇటీవలే కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో దీపిక పాల్గొనగా ఆమె బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఆ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో అందర్నీ ఆకట్టుకున్నది. కాకపోతే ఆ ఈవెంట్ లో దీపిక ధరించిన డ్రెస్, చెప్పులు, కార్టియర్ ఆభరణాల ధర కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం.

ఇటీవలే కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో దీపిక పాల్గొనగా ఆమె బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఆ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో అందర్నీ ఆకట్టుకున్నది. కాకపోతే ఆ ఈవెంట్ లో దీపిక ధరించిన డ్రెస్, చెప్పులు, కార్టియర్ ఆభరణాల ధర కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Jun 28, 2024 | 1:41 PMUpdated Jun 28, 2024 | 1:41 PM
Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీపిక కాస్ట్యూమ్స్ ధర తెలిస్తే షాక్..!

ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నిన్న అనగా జూన్ 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మూవీని నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహించారు. అలాగే పాన్ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ సినిమాకు అటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తునే థియేటర్లకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే థియేటర్లు మొత్తం హోస్ ఫుల్ అయ్యాయి. ఇకపోతే కల్కి సినిమా మొదటిరోజే హిట్ టాక్ రావడంతో..ఆడియోన్స్ చూడటానికి చాలా అతృతగా థియేటర్ల బారున పడుతున్నారు. అలాగే కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, శోభన, దిశా పటానీ,అన్నా బెన్ మొదలగువారు కీలకపాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే..కల్కి మూవీకి సంబంధించి గత కొన్ని రోజులు క్రితం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో దీపికా పదుకొణె పాల్గొనగా ఆమె బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఆ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో అందర్నీ ఆకట్టుకున్నది. కాకపోతే ఆ ఈవెంట్ లో దీపిక ధరించిన డ్రెస్, చెప్పులు, కార్టియర్ ఆభరణాల ధర కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం.

ప్రభాస్ కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీపిక బేబీ బంప్ తో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ఆ ఈవెంట్ దీపిక చూడటానికి సింపుల్ లుక్స్ లో ఉన్న ఆమె ధరించిన ఆభరణాల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ప్రస్తుతం దీపికా ధరించిన కాస్ట్యూమ్స్ ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే దీపిక కార్టియర్ బ్రాండ్ ఆభరణాలకు ప్రపంచ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఆ ఈవెంట్ లో తల నుంచి కాలి వరకు అన్ని ఆ బ్రాండ్ కాస్ట్యూమ్స్ నే ధరించింది. ముఖ్యంగా దీపిక ఆ ఈవెంట్ లో లోవే బ్రాండ్ కు చెందిన సింపుల్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ ను సెలక్ట్ చేసుకుంది. ఇక డ్రెస్ కాస్ట్ రూ. 1.14 కావడం గమన్హారం. ఇక విషయం తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. అంతేకాకుండా.. ఆమె కాలకి మాగ్డా బుట్రిమ్ బ్రాండ్ స్టైలీష్ హై హీల్స్ చెప్పులు ధరించింది.

ఇక వాటి విలువ రూ.61,293. అలాగే దీపిక కార్టియర్ రోజ్ కోట్ తో ఉన్న డైమండ్స్ బ్రాస్ లెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పైటి వాటి ధర అక్షరాల రూ.1.94 కోట్లు. దీంతో పాటు దీపిక పాంథెర్ డి కార్టియర్ బ్రాస్‌లెట్‌ ను ధరించింది. అయితే పచ్చపొడులు వజ్రాలతోపాటు 18k తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ అద్భుతమైన బ్రాస్ లెట్ విలువ రూ.5.34. అలాగే దానితో పాటు మరో కార్టియర్డ్ బ్రాస్ లెట్ ధర రూ.4.34. దానితో పాటు ఇయర్ రింగ్ ధర రూ.1,8600. ఇక 3 హ్యాండ్ రింగ్స్ ధర.3,50,000 ఇలా దీపికకు ధరించిన మొత్తం కాస్ట్యూమ్స్ విలువ రూ.17,14,64,293 కావడం గమన్హారం. కాగా, ప్రస్తుతం దీపిక కాస్ట్యూమ్స్ ధరకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీపిక ధరించి ఆభరణాల విలువ తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి, కల్కి ఈవెంట్ లో సింపుల్ లుక్స్ గా కనిపించిన ఆమె ధరించిన వస్తువులు కోట్ల రూపాయలు ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Meera (@shineupwith.meera)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి