iDreamPost

కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో కూడా నటిస్తా! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

కథ డిమాండ్ చేస్తే.. అలాంటి పాత్రల్లో, సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఓ హీరోయిన్. మరి ఆ పాత్రలు ఏంటి? ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

కథ డిమాండ్ చేస్తే.. అలాంటి పాత్రల్లో, సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఓ హీరోయిన్. మరి ఆ పాత్రలు ఏంటి? ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో కూడా నటిస్తా! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఇండస్ట్రీలో నటీ, నటులుగా మంచి గుర్తింపు సంపాదించాలంటే విభిన్నరకాలైన పాత్రలు చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది మాత్రం గిరి గీసుకుని పలానా పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ భీష్మించుకుని కూర్చుంటారు. అలాంటి వారికి ఇండస్ట్రీలో స్థానం కష్టమే. ఇక మరికొందరు మాత్రం కథ డిమాండ్ చేస్తే గ్లామర్ గేట్లు ఎత్తేయడానికి రెడీ అంటూ డైరెక్ట్ గానే స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇలాంటి బోల్డ్ స్టేట్మెంటే ఇచ్చింది. కథ డిమాండ్ చేస్తే.. అలాంటి పాత్రల్లో నటించడానికి తనకు ఏ మాత్రం  ఇబ్బంది లేదని పేర్కొంది.

మాళవిక మీనన్.. టాలీవుడ్ లోకి 2016లో విడుదలైన ‘లవ్ కే రన్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో ‘ఆ అమ్మాయి అంతే అదో టైపు’ మూవీలో నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఇక ఈ బ్యూటీ తమిళ్, మలయాళ చిత్రాల్లో నటింటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చోటు కొట్టేసింది. తాజాగా మలయాళంలో మాళవిక నటించిన ‘తంగమణి’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి’ సినిమాలు ఇటీవలే విడుదల అయ్యి ప్రేక్షక ఆదరణపొందాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

మాళవిక మీనన్ మాట్లాడుతూ..”నేను తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించాను. 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. 2011లో వచ్చిన మలయాళ చిత్రం ‘నిద్ర’లో హీరో చెల్లిలి పాత్ర చేశాను. ‘916’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను.  అయితే నేను ఇప్పటి వరకు ఎలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్, గ్లామర్ పాత్రలు చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి పాత్రలు తక్కువగా వస్తుంటాయి. తమిళ్, తెలుగు భాషల్లో గ్లామర్ రోల్స్ లో నటించడానికి ఎక్కువ స్కోప్ తో పాటుగా అవకాశాలు కూడా ఉంటాయి” అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది. మరి గ్లామర్, ముద్దు సన్నివేశాల్లో నటిస్తానని చెప్పాక ఆఫర్లు రాకుండా ఉంటాయా? అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాక ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో వేచిచూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Malavika✨ (@malavikacmenon)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి