iDreamPost

అంత్యక్రియలకు బంధువుల ఏర్పాట్లు.. అంతలోనే బతికొచ్చిన వ్యక్తి

ఓ వ్యక్తి రైలు ఢీ కొని చనిపోయాడు. రైల్వే పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. ముఖం చిద్రమవ్వడంతో గుర్తుపట్టలేకపోయారు. అయితే ఫోను ఆధారంగా తమ వ్యక్తే అని భావించారు. కానీ

ఓ వ్యక్తి రైలు ఢీ కొని చనిపోయాడు. రైల్వే పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. ముఖం చిద్రమవ్వడంతో గుర్తుపట్టలేకపోయారు. అయితే ఫోను ఆధారంగా తమ వ్యక్తే అని భావించారు. కానీ

అంత్యక్రియలకు బంధువుల ఏర్పాట్లు.. అంతలోనే బతికొచ్చిన వ్యక్తి

చెప్పాపెట్టకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. రైలు ప్రమాదంలో మరణించాడు. రైల్వే అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. మృతదేహం దగ్గర దొరికిన ఫోను ఆధారంగా తమ వ్యక్తే అనుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, చుట్టాలు, స్థానికులు, ఇరుగు పొరుగు వచ్చి ఏడుపు, పెడబొబ్బలు పెట్టారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. ఇక జరగాల్సిన కార్యక్రమాలు చూడాలంటూ పెద్దలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ పనులు చేపడుతున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అంతలోకి ఎంట్రీ ఇచ్చాడు మరణించిన వ్యక్తి. ఒక్కసారిగా ఖంగుతిన్నారు అక్కడున్నవారు. ఈ వింత ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా బహీరాబాద్ మండల కేంద్రంలో వింత సంఘటన జరిగింది. రైలు ప్రమాదంలో మరణించిన వ్యక్తి.. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా తిరిగి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. తీరా అతడు చెబితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ఇంత పని చేసిందని అర్థమైంది. వివరాల్లోకి వెళితే.. బహీరాబాద్ మండల కేంద్రంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నాడు ఎల్లప్ప. అతడు పశువులు కాసకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకగా, ఆదివారం రైల్వే పోలీసుల నుండి సమాచారం అందింది. ఇక్కడ ఓ వ్యక్తి రైలు ఢీ కొని మరణించాడని, అతడి మొబైల్ ఫోన్ ఆధారంగా కాల్ చేస్తున్నామని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు.

హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొహం చిద్రం కావడంతో ఎల్లప్పను గుర్తించలేకపోయారు. ఫోను ఉండటంతో అతడే అని భావించారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల నిమిత్తం తమ స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా.. సినీ ఫక్కీలో ఎంట్రీ ఇచ్చాడు ఎల్లప్ప. ఒక్కసారిగా షాక్ తిన్న కుటుంబ సభ్యులు ఏమైందని చెప్పగా.. తాను.. రైలులో తాండూరు చేరుకున్నానని, అక్కడ ఓ వ్యక్తి తన ఫోను దొంగిలించాడని చెప్పాడు. అతడే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడు మృతుడు ఎవరన్నదీ సమాచారం సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి