iDreamPost

వీడియో: ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌కు వేధింపులు.. నడి రోడ్డు మీద అడ్డగించి మరీ

  • Published Jun 28, 2024 | 1:43 PMUpdated Jun 28, 2024 | 1:43 PM

ఆడవారిపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. ఈ క్రమంలో మరో ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై నడి రోడ్డు మీద వేధింపులకు దిగాడు ఓ యువకుడు. ఆ వివరాలు..

ఆడవారిపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. ఈ క్రమంలో మరో ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై నడి రోడ్డు మీద వేధింపులకు దిగాడు ఓ యువకుడు. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 1:43 PMUpdated Jun 28, 2024 | 1:43 PM
వీడియో: ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌కు వేధింపులు.. నడి రోడ్డు మీద అడ్డగించి మరీ

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా సరే సమాజంలో నేర ప్రవృత్తి మాత్రం తగ్గడం లేదు. నేరాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించినా.. పరిస్థితిలో మార్పు మాత్రం రావడం లేదు. విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. జైలు, శిక్షలంటే భయం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా మహిళలపై నేరాలకు పాల్పడే వారు ఏమాత్రం భయపడటం లేదు. ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులుకు గురి చేస్తున్నారు. వారి మాట వినకపోతే హత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేశాడో వ్యక్తి. నడిరోడ్డు మీద ఆమె వెంటపడుతూ.. వీరంగం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

ఈ సంఘటన బిహార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేశాడో వ్యక్తి. రోడ్డు మీదనే ఆమెను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇక ఈ సంఘటన బిహార్‌ బంకా జ్లిలాలో వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోన్న ఓ యువతి.. స్కూల్‌ అయిపోయిన తర్వాత.. తండ్రితో కలిసి బైక్‌ మీద ఇంటికి తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో ముఖానికి మాస్క్‌ కట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి.. ఆ తండ్రీకూతుళ్లను అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో వారిని బెదిరిస్తూ.. టీచర్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. యువతి వల్ల తన జీవితం నాశనం అయ్యిందంటూ ఆరోపిస్తూ.. బలవంతంగా ఆమె నుదుటిన సింధూరం పెట్టడానికి ప్రయత్నించాడు.

యువకుడు ఇలా చేస్తుండగా.. పక్కనే ఉన్న అతడి స్నేహితుడు దీన్ని వీడియో తీశాడు. యువతి తండ్రి.. సదరు యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అతడిని తోసేసి.. యువతి పాపిట్లో సింధూరం పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన యువతి ఆ తర్వాత తేరుకుంది. వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. ఇక యువతిని వేధించిన వ్యక్తి.. బభంగమాలో నివసించే సౌరభ్‌ సోను అని తెలిసింది.

అతడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడని.. వెల్లడైంది. దీనిపై రెండు నెలల క్రితమే సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. అయితే వారు అతడిని మందలించి వదిలేశారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా సౌరభ్‌.. తిరిగి యువతిని వేధించడం ప్రారంభించాడు. ఈ సారి ఏకంగా నడి రోడ్డుపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. సౌరభ్‌పై కఠిన చర్యలు తీసుకుని.. తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి