iDreamPost

రీఛార్జ్ ధరలు పెంచిన Airtel,Jio.. తక్కువ ధర ఎందులో అంటే?

Airtel and Jio recharge plans: టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఎయిర్ టెల్, జియోలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఎందులో తక్కువ ధరలు ఉన్నాయంటే?

Airtel and Jio recharge plans: టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఎయిర్ టెల్, జియోలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఎందులో తక్కువ ధరలు ఉన్నాయంటే?

రీఛార్జ్ ధరలు పెంచిన Airtel,Jio.. తక్కువ ధర ఎందులో అంటే?

మొబైల్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త. ఇప్పటికే అధిక ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలకు రీఛార్జ్ ల రూపంలో మరింత ఆర్థిక భారం తప్పేలా లేదు. ఫోన్ వినియోగం ఎక్కువైన తరుణంలో నెల వారీ రీఛార్జ్ లు చేయక తప్పడం లేదు. రీఛార్జ్ చేయించకపోతే సర్వీసులను నిలిపివేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఈ క్రమంలో టెలికాం రంగంలో దిగ్గజాలైన ఎయిర్ టెల్, జియో యూజర్లకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి.

రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లలో 12-27 శాతం పెంపును ప్రకటించింది. తాజాగా ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను 10-21 శాతం పెంచింది. జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. పెరిగిన ధరల ప్రకారం ఎందులో తక్కువ ధరలు ఉన్నాయంటే?ఎయిర్ టెల్, జియోలో పెరిగిన రీఛార్జ్ ధరలను పోల్చి చూసినట్లైతే జియోలోనే కాస్త ధరలు తక్కువగా ఉండి, బెనిఫిట్స్ సైతం ఎక్కువగా ఉన్నాయి.

28 రోజుల ప్లాన్:

ఎయిర్ టెల్ లో రూ. 299 రీఛార్జ్ ప్లాన్ పై 28 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 100 మెసేజ్ లను అందిస్తుంది. ఇవే ప్రయోజనాలను జియోలో రూ. 249 కే పొందొచ్చు. అదే విధంగా ఎయిర్ టెల్ లో రూ. 349 రీఛార్జ్ ప్లాన్ పై 28 రోజుల పాటు 1.5జీబీ లభిస్తుండగా జియోలో రూ. 299కే పొందొచ్చు.

56 రోజుల ప్లాన్:

ఎయిర్ టెల్ లో రూ. 579 రీఛార్జ్ ప్లాన్ పై 56 రోజుల పాటు 1.5జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, మెసేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. జియోలో ఇవే ప్రయోజనాలు రూ. 579కి అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్ లో మరో ప్లాన్ రూ. 649 తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజులపాటు 2జీబీ అందుకోవచ్చు. జియోలో మాత్రం యూజర్లు రూ. 629కే పొందొచ్చు.

84 రోజుల ప్లాన్:

ఎయిర్ టెల్ లో రూ. 859 రీఛార్జ్ ప్లాన్ పై 84 రోజులపాటు 1.5జీబీ డేటాను పొందొచ్చు. ఇవే బెనిఫిట్స్ తో జియోలో రూ. 799కే రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక 84 రోజులపాటు 2జీబీ కావాలనుకునే వారికి ఎయిర్ టెల్ లో రూ. 979 వెచ్చించాలి. జియోలో మాత్రం రూ. 859కే పొందొచ్చు.

365 రోజుల ప్లాన్:

ఎయిర్ టెల్ లో రూ. 3599 వార్షిక ప్లాన్ పై 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఇదే సమయంలో జియోలో రూ. 3599కి 2.5జీబీ డేటా ఇతర ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ విధంగా పెరిగిన ధరల ప్రకారం పోల్చుకుంటే ఎయిర్ టెల్ కంటే జియోలోనే తక్కువ ధరలతో పాటు బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. యూజర్లు వారి ఇష్టాల ప్రకారం ఏ నెట్ వర్క్ నైనా ఎంచుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి