iDreamPost
android-app
ios-app

Revanth Reddy: టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల

  • Published Jun 28, 2024 | 9:31 AM Updated Updated Jun 28, 2024 | 9:31 AM

తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న కలను సాకారం చేసింది. ఆ వివరాలు..

తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న కలను సాకారం చేసింది. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 9:31 AMUpdated Jun 28, 2024 | 9:31 AM
Revanth Reddy: టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం కృషి చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. సామాన్యులు, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇచ్చిన హామీలను మాత్రమే కాక.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.. అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది. ఇక రైతుల కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. దాంతో పాటు గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వారికి మేలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న టీచర్లకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కల నెరవేర్చేందుకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది.

తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్లుగా ప్రమోషన్స్‌ కోసం ఎదురు చేస్తోన్న ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18,942మందికి ప్రమోషన్స్‌ లభించనున్నాయి. ఇన్నాళ్లు ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్‌-1 (ప్రభుత్వ, స్థానిక సంస్థలు)లకు సంబంధించి.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ – 10,083, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు – 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్‌-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌కు- 6,989 స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు- 776మందకి పదోన్నతలు వచ్చాయి.

ఇక తెలంగాణలో విద్యాశాఖ తన వద్దే ఉందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు రేవంత్‌ రెడ్డి. ఆయన చొరవతో ఈ అంశంలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది.

ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న తమ కలను సాకారం చేశారని