iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఓ స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు.

హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఓ స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాల నివారణకు కారణమవుతున్నారు వాహనదారులు. అతి వేగం ప్రమాదకరం అని పదే పదే చెప్తున్నప్పటికీ ఓవర్ స్పీడుతో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు హైవే మీద ప్రయాణిస్తూ యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు స్కూల్ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

పాఠశాలకు సమయం అవుతున్నది. ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ బస్సు పాఠశాలకు బయలుదేరింది. ఇలా వస్తున్న క్రమంలో స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హన్మకొండ – కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో స్కూలు బస్సు బోల్తా పడింది. ఒక్కసారిగా బస్సులోని విద్యార్థులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. ఆ ప్రాంతమంతా విద్యార్థుల అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి సహాయక చర్యలు చేపట్టారు.

అయితే స్కూల్ బస్సు బోల్తా పడిన వెంటనే కొందరు విద్యార్థులు చాకచక్యంగా వ్యవహరించారు. ఇద్దరు విద్యార్థులు వెంటనే బస్సు కిటికీలోంచి కిందికి దూకి ఎమర్జెన్సీ విండోలను పగలగొట్టారు. ఆ తర్వాత బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.