iDreamPost

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

Gold Rate Decrease: బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. ఇవాళ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Decrease: బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. ఇవాళ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

పెట్రోల్ ఎంత అవసరమో బంగారం కూడా ఇప్పుడు అంతే అవసరంగా మారిపోయింది. పెట్రోల్ రేట్లు ఎంతున్నా గానీ ట్యాంక్ ఫిల్ చేయించుకోవడం ఎలా అయితే ఆపరో.. బంగారం ధర ఎంతున్నా గానీ అవసరం అనుకున్నప్పుడు కొనకుండా ఉండలేరు. ఆ టైంకి శుభకార్యాలు ఉండడం, ముహూర్తాలు మళ్ళీ రాకపోవడం వంటి కారణాలతో ఆ టైంకి గోల్డ్ రేటు ఎంతున్నా కొనేస్తుంటారు. అలానే వెండి ఆభరణాలు కూడా. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ రాగా.. తాజాగా ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్, బాండ్ ఈల్డ్స్ విలువ పెరుగుతుంది. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన కారణంగా ప్రస్తుతం బంగారం ధరలు తగ్గాయి. యూఎస్ నాన్ ఫామ్ పేరోల్ రిపోర్ట్ కూడా సానుకూలంగా ఉన్నందున బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధర 3.50 శాతం తగ్గింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 73.75 2,293.84 డాలర్ల వద్ద ఉంది. ఇక వెండి ధర అయితే 6.91 శాతం పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి ధర రూ. 29.17 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

శుక్రవారం నాడు అనగా జూన్ 7న 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము వద్ద రూ. 7,375 ఉండగా.. ఇవాళ ఏకంగా 208 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల మీద 2080 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గ్రాము బంగారం రూ. 7,167గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం శుక్రవారం నాడు గ్రాము వద్ద 6,760 ఉండగా ఇవాళ 190 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గ్రాము బంగారం రూ. 6570గా ఉంది. 24 క్యారెట్ల గ్రాము బంగారం రూ. 7,167 పలుకుతోంది. 67,600 ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ. 65,700కి చేరుకుంది. 73,750 రూపాయలుగా ఉన్న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 71,670 రూపాయలకు చేరుకుంది.

బంగారం ధరలు గ్రాముల్లో:

  • 22 క్యారెట్ల బంగారం: రూ. 6,570/-     
  • 24 క్యారెట్ల బంగారం: రూ. 7,167/-

బంగారం ధరలు పది గ్రాముల్లో:

  • 22 క్యారెట్ల బంగారం: రూ. 6,5700/-     
  • 24 క్యారెట్ల బంగారం: రూ. 7,1670/-

వెండి ధరలు:

  • గ్రాము వెండి: రూ. 915/-
  • పది గ్రాములు: రూ. 9,150/-
  • కిలో వెండి: రూ. 91,500/-

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి