iDreamPost

అమ్మాయిపై అమ్మాయికి.. అబ్బాయిపై అబ్బాయికి ప్రేమ.. OTTలో వెరైటీ లవ్ స్టోరీ!

OTT Suggestions- Best Variety Love Story: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, వాటిలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఇది బెస్ట్ లవ్ స్టోరీనే కాదు.. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా.

OTT Suggestions- Best Variety Love Story: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, వాటిలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఇది బెస్ట్ లవ్ స్టోరీనే కాదు.. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా.

అమ్మాయిపై అమ్మాయికి.. అబ్బాయిపై అబ్బాయికి ప్రేమ.. OTTలో వెరైటీ లవ్ స్టోరీ!

ఈ సమాజంలో చాలానే సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్ని కొన్ని మన ప్రమేయం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం ఏం చేసినా అవి ఒక పట్టనా తెగవు. అలాంటి సమస్యలో జెండర్ ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ సమ సమాజంలో సమానత్వం జోలికి మనం పోవద్దు. కానీ, జెండర్ ఈక్వాలిటీ అనేది కచ్చితంగా అందరూ ప్రశ్నించాల్సిన అంశం. అంటే లింగ బేధం లేకుండా అందరూ ఒకటే అనే సమానత్వం. అంటే కేవలం ఆడ, మగే కాదు.. మిగిలిన వాళ్లు కూడా. కొన్ని కొన్ని శారీరక సమస్యల వల్ల ఆడ మగగానూ.. మగ ఆడగాను మారుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా సమానంగా చూడాలి. వారికి కూడా విలువ ఇవ్వాలి అనే పాయింట్ మీద ఒక లవ్ స్టోరీ వచ్చింది.

సాధారణంగా మీరు ఈ మధ్యకాలంలో గే మ్యారేజెస్ గురించి వినే ఉంటారు. అబ్బాయిలు.. అబ్బాయిలే పెళ్లి చేసుకుంటారు. అలాగే అమ్మాయిలు.. అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా చూశాం. ఇలాంటివి సమాజంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇలాంటి పాయింట్ మీద వచ్చిన సినిమానే ఇది. అంటే వారికి శారీరకంగా.. హార్మోన్స్ వల్ల వచ్చిన సమస్యలను పట్టించుకోకుండా కడుపున పుట్టిన పిల్లలను దూరం పెడుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాంటి వారు వీధిన పడి సరైన జీవితం లేక.. సరైన సపోర్ట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాడు నా కొడుకో కాదు.. అలాంటిది నా కూతురే కాదు అని అనే వాళ్లు చాలా మందే ఉన్నారు.

OTT Movie

ఈ సినిమాలో కూడా హీరో గే. అతను మరో యువకుడిని ఇష్టపడతాడు. అయితే ఇదంతా ఇంట్లో వాళ్లకు అస్సలు ఇష్టం ఉండదు. అతను ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెకు అబ్బాయిలు అంటే పడదు. ఆమె ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది. ఆమెతో సంతోషంగా ఉండాలి అనుకుంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ ఒక ట్రిప్పుకు వెళతారు. అలా వారి మధ్య స్నేహం పెరుగుతుంది. అలాగే వారి వారి జీవితాల గురించి ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. వారి గతం తల్చుకుని కుమిలిపోతారు.

ఆ తర్వాత కొత్త జీవితం గురించి ఆలోచిస్తారు. ఈ గ్యాప్ లో వారి జీవితాల్లో ఊహించని ఘటన జరుగుతుంది. ఆ తర్వాత సినిమా కథే మారిపోతుంది. అలాంటి మూవీ ఒకటి ఓటీటీలో ఉందని మీకు అసలు తెలియదు కదా. అందుకే మీకోసం ఈ మూవీని సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ మూవీ పేరు ‘హమ్ బీ అకేలే.. తుమ్ బీ అకేలే’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఈ మూవీ ఇప్పటికే చూసుంటే మాత్రం.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి