తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త సొబగులు అద్ది పండితుల నుంచి పామరుల దాకా అందరినీ అలరించే గొప్ప గీత సంపదను అందించిన మహానుభావులు కొందరే ఉంటారు. ఆ ముందు వరుసలో ఉన్న వారిలో సీతారామశాస్త్రి గారిది అగ్రపీఠం. సిరివెన్నెలనే ఇంటి పేరుగా మార్చుకుని మూడు దశాబ్దాలకు పైగా అసంఖ్యాకమైన అభిమానులను, సంగీత ప్రియులను తన శిష్యులుగా మార్చుకున్న ఘనత ఆయనకే చెల్లుతుంది. కళామతల్లికి చేయాల