iDreamPost
android-app
ios-app

‘META’గా మారిన ఫేస్ బుక్.. అసలు కథ ఇదా?

‘META’గా మారిన ఫేస్ బుక్.. అసలు కథ ఇదా?

చాలా కాలం నుండి జరుగుతున్న ప్రచారం నిజమైంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు మారింది. యూనివర్సిటీలో కొంతమంది కనెక్టివిటీ కోసం ఏర్పాటయిన ఫేస్ బుక్ చివరికి కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారం అయింది. తొలుత దీన్ని ది ఫేస్ బుక్ గా ప్రారంభించగా దాన్ని ఫేస్ బుక్ గా మార్చారు.. ఇప్పుడు META గా మారింది. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరును ‘META’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాక ఇక మీదట తమ కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త సింబల్ ‘MVRS’తో ట్రేడ్ అవుతాయని జుకర్ బర్గ్ వెల్లడించారు. MVRS అంటే మెటా వర్స్(metaverse), ఈ మెటా వర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం అట, ‘Meta’ అనేది గ్రీకు పదమట.

ఇక ఈ META కొత్తలోగో కూడా కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించబడింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మాతృసంస్థ పేరు మారిందే తప్ప ఫేస్‌బుక్‌ గొడుగు కింద ఇంతకాలం కొనసాగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్‌లు అవే పేరుతో రన్ అవుతాయి. అయితే అవన్నీ ఇక మీదట ‘మెటా’ గొడుగు కింద కొనసాగుతాయి. భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జూకర్ బర్గ్ చెబుతున్నారు. రానున్న దశాబ్దంలో వంద కోట్లమందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని జూకర్ బర్గ్ చెబుతున్నారు.

కానీ ప్రైవసీ బ్రీచ్ మొదలు, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్తా గ్రామ్ వంటి వాటి సేవల్లో అంతరాయాలు వంటి అంశాలపై ఫేస్‌బుక్ తీవ్ర విమర్శలపాలు కాగా వాటి నుంచి ప్రజల దృష్టి, షేర్ హోల్డర్స్ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ సోషల్ మీడియా గొడుగు కింద ఇన్ స్టా గ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్ సెట్, హొరైజన్ వీఆర్ వంటివి కూడా ఉండగా వాటన్నింటినీ ‘ఫేస్ బుక్’ అనే పేరు సూట్ కావడం లేదని అంటున్నారు. అంతే కాక ప్రస్తుతం తమను సామాజిక మాధ్యమ సంస్థగానే పరిగణిస్తున్నారని, కానీ తమది ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీ అని జూకర్ పేర్కోన్నారు.

Also Read : AP Tourism-ఇదే టైం.. చ‌లో అర‌కు..