iDreamPost
android-app
ios-app

నిద్రలో డబ్బు కలలు వస్తున్నాయా? వాటికి అర్థం ఏంటి?

నిద్రలో డబ్బు కలలు వస్తున్నాయా? వాటికి అర్థం ఏంటి?

ధనం మూలం ఇథమ్‌ జగత్‌. ఈ సమాజం మొత్తం డబ్బు చుట్టే నడుస్తూ ఉంది. డబ్బుతో ముడిపడని మనిషి జీవితం అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది జీవితంలో డబ్బు అతివృష్టిలా ఉంటే.. మరికొంత మంది జీవితంలో అనావృష్టిలా ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఉన్న వాడు.. ఆ డబ్బు ఎప్పుడు పోతుందో తెలీక బాధ పడితే.. డబ్బులేని వాడు ఆ డబ్బు లేని కారణంగా ఇబ్బందుల్ని.. ఆ డబ్బుతో వచ్చే సుఖల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు డబ్బుకు సంబంధించిన కలలు వస్తూ ఉంటాయి.

కలల్లో డబ్బు కనిపించటం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. మన జీవితంలోని పరిస్థితులకు కలలు అద్దం పడుతూ ఉంటాయి. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్లకు డబ్బు గురించి కలలు వస్తూ ఉంటాయి. అయితే, ఇలా కలలు రావటం అన్నది కాన్సస్‌ మైండ్‌కు.. సబ్‌ కాన్సస్‌ మైండ్‌కు మధ్య వారధిలా మారుతుందట. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుందట. అవి భవిష్యత్తు తాలూకా పరిణామాలను సూచిస్తాయట.  మీకు వచ్చే కలలు.. ఆ కలల అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలో డబ్బు తీసుకోవటం..

నిద్రలో మీరు డబ్బులు తీసుకుంటున్నట్లు కల వస్తే.. మీ దృఢ సంకల్పానికి సంకేతమట. అది భవిష్యత్తులో కలగబోయే విజయాన్ని సూచిస్తుందట. మీ జీవితంలో చోటుచేసుకోబోయే మంచిని కూడా సూచిస్తుందట. కొత్త అవకాశాలకు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని మన మైండ్‌ చెప్పడమేనట.

కలలో డబ్బులు గెలుచుకోవటం..

కలలో డబ్బులు గెలుచుకోవటం అన్నది సంతోషానికి.. విజయానికి సంకేతమట. జీవితంపై ఆశావాదానికి.. నమ్మకానికి చిహ్నమట. జీవితంపై పాజిటివీటీని సూచిస్తుందట. జీవితం మీకిచ్చినదానిపై కృతజ్ఞత.. భవిష్యత్తు కష్టాలను దూరం పెట్టడాన్ని సూచిస్తుందట.

కలలో డబ్బులు కనిపించటం..

కలలో అనుకోకుండా డబ్బులు కనిపించటం అన్నది.. పాజిటివ్‌ మైండ్‌సెట్‌ను సూచిస్తుందట. అంతేకాదు.. అది అదృష్టానికి.. కొత్త అవకాశాలకు కూడా సంకేతమట. మీ గోల్‌కు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవటంలో కాన్ఫిడెన్స్‌ను సూచిస్తుందట.

కలలో డబ్బుల్ని కోల్పోవటం..

డబ్బుల్ని కోల్పోయినట్లు గనుక మీకు కలలు వస్తే.. అది ఒత్తిడికి చిహ్నమట. ఇది ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో మీకున్న భయాలను సూచిస్తుందట. అంతేకాదు! ఇది మీ ఆర్థిక కష్టాలకు కూడా చిహ్నమట.