iDreamPost

Britannia: అక్కడ మూసేస్తున్న బ్రిటానియా బిస్కెట్‌ కంపెనీ.. ఉద్యోగులందరికీ పదవీ విరమణ

  • Published Jun 25, 2024 | 3:26 PMUpdated Jun 25, 2024 | 3:26 PM

బ్రిటానియా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే..

బ్రిటానియా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే..

  • Published Jun 25, 2024 | 3:26 PMUpdated Jun 25, 2024 | 3:26 PM
Britannia: అక్కడ మూసేస్తున్న బ్రిటానియా బిస్కెట్‌ కంపెనీ.. ఉద్యోగులందరికీ పదవీ విరమణ

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. పిల్లలు, పెద్దలు, వృద్ధుల వరకు.. బిస్కెట్‌ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గుడ్డే బిస్కెట్స్‌. ఇదే కాక బ్రిటానియా కంపెనీ తీసుకు వచ్చిన అనేక రకాల బిస్కెట్లు జనాలకు ఎంతో చేరువయ్యాయి. నేడు ఎఫ్‌ఎంసీజీ రంగంలో.. బ్రిటానియా దిగ్గజ కంపెనీగా నిలిచింది. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇక బ్రిటానియా కంపెనీ అంటే జనాల్లో ఎంతో మంచి పేరు ఉంది. ఈ కంపెనీని కొన్ని దశాబ్దాల క్రితం అనగా స్వతంత్రం వచ్చిన సమయంలో స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఎఫ్‌ఎంసీజీ రంగంలోనే టాప్‌ కంపెనీగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా బ్రిటానియా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీని మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. 1947లో, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రారంభించిన ఫ్యాక్టరీల్లో ఒకదానిని బిట్రానియా క్లోజ్ చేయబోతోంది. ఇంతకు అది ఏ బ్రాంచ్‌ అంటే.. పశ్చిమ బెంగాల్‌లోని, కోల్‌కతాలో ఉన్న కంపెనీ. ఈ చారిత్రాత్మక కర్మాగారం తలుపులను బ్రిటానియా కంపెనీ శాశ్వతంగా మూసేస్తోంది. ఇది, ఈ బిస్కెట్‌ కంపెనీ తొలి ఉత్పత్తి యూనిట్. మేరీ గోల్డ్, గుడ్ డే వంటి బిస్కెట్ల తయారీలో ఈ యూనిట్‌కు మంచి పేరుంది. కంపెనీని మూసి వేస్తున్న నేపథ్యంలో.. ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులంతా స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నారు.

కోల్‌కతాలోని తమ ఉత్పత్తి యూనిట్‌ని మూసేస్తున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా బ్రిటానియా ఇండస్ట్రీస్ వెల్లడించిందిఫ్యాక్టరీని మూసివేయడం వల్ల ఏ ఒక్క ఉద్యోగిపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ కంపెనీలో పని చేస్తోన్న ఫ్యాక్టరీలోని శాశ్వత ఉద్యోగులందరూ వాలెంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌కు అంగీకరించారని ప్రకటించింది. కోల్‌కతాలోని ఫ్యాక్టరీ మూతపడడం వల్ల సుమారు 150 మంది శాశ్వత ఉద్యోగులపైన ప్రభావం పడనుంది. అయితే కోల్‌కతా ఫ్యాక్టరీని మూసివేయడం వల్ల.. కంపెనీ వ్యాపారంపైనా ఎలాంటి ప్రభావం పడదని కూడా బ్రిటానియా తెలిపింది.

ఈ బిస్కెట్‌ ఫ్యాక్టరీ.. కోల్‌కతాలోని తరటాలా ప్రాంతంలో దాదాపు 11 ఎకరాల్లో విస్తరించారు. బ్రిటానియా కంపెనీ.. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకుంది. లీజు గడువు 2048 వరకు ఉంది. అంటే, మరో 24 ఏళ్ల పాటు ఆ భూమి బ్రిటానియా ఇండస్ట్రీస్ ఆధీనంలోనే ఉంటుంది. బిస్కెట్‌ ఫ్యాక్టరీని మూసేసిన తర్వాత, 2048 వరకు ఆ భూమిని ఎలా ఉపయోగించుకుంటారన్న విషయానికి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. కోల్‌కతా కంపెనీని మూసి వేయడం వల్ల సుమారు 150 మంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇక కంపెనీని మూసివేయడం వల్ల కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని బ్రిటానియా కంపెనీ.. వాటాదర్లందరికీ సమాచారం అందించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి