iDreamPost

దర్శన్ కు నటి మద్దతు.. చెప్పుకోలేని కామెంట్స్ తో ఫ్యాన్స్ ట్రోల్స్!

Darshna Fans Trolls On Actress Sonu Srinivas gowda: హీరో దర్శన్ ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే తమ అభిమాన హీరోకి మద్దతు తెలపలేదు అంటూ ఫ్యాన్స్ నటిపై ట్రోల్స్ చేశారు.

Darshna Fans Trolls On Actress Sonu Srinivas gowda: హీరో దర్శన్ ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే తమ అభిమాన హీరోకి మద్దతు తెలపలేదు అంటూ ఫ్యాన్స్ నటిపై ట్రోల్స్ చేశారు.

దర్శన్ కు నటి మద్దతు.. చెప్పుకోలేని కామెంట్స్ తో ఫ్యాన్స్ ట్రోల్స్!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఒక హీరో పేరు మారుమోగుతోంది. అది మరెవరో కాదు.. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ది. సొంత అభిమానిని హత్య చేయించారు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా ఉంది. అలాగే నెట్టింట కూడా ఇదే విషయంపై పెద్దఎత్తున చర్చలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ హీరోకి మద్దతు తెలిపిన ఒక నటిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. దర్శన్ ఫ్యాన్స్ ఆ నటిని చెప్పుకోలేని రీతిలో తిట్టేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. ఇంక చాలు ఆపండి అంటూ ఆ నటి వేడుకుంటోంది.

హీరో దర్శన్, నటి పవిత్రా గౌడ ప్రస్తుతం రిమాండు కైధీలుగా ఉన్నారు. తన సొంత అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే దర్శన్ కు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లేదు. కానీ, అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోది తప్పులేదు అంటూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. ఎవరు దర్శన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా.. అసలు స్పందించకపోయినా కూడా వారిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే వారి లిస్టులోకి రీల్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ చేరింది. ఆమెకు వారి కామెంట్స్ తో నరకం చూపిస్తున్నారు. ఎందుకు దర్శన్ కు సపోర్ట్ చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషతో సోను శ్రీనివాస్ గౌడను ఇబ్బంది పెడుతున్నారు. చివరికి ఆమె స్పందించేలా చేశారు. ఈ కామెంట్స్ పై సోను శ్రీనివాస్ గౌడ స్పందించింది. దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టద్దు అంటూ వేడుకుంది. దర్శన్ సార్ గురించి మాట్లాడే అంత ఎదిగిపోలేదు. మేము ఇంకా పిల్లలమే.. ఎప్పటికీ ఆయన అభిమానులమే. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఆపేయండి. డి బాస్ సార్ త్వరగా తిరిగి రావాలి అని కోరుకుందాం. అంతా మంచే జరుగుతుంది. దయచేసి అందరూ కాస్త సంయమనం పాటించండి. రెండు కుటుంబాలకు మంచి జరగాలి అని కోరుకుందాం. అంటూ సోను శ్రీనివాస్ గౌడ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక షార్ట్ వీడియో అప్ లోడ్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shambhavi.srinivasgowda54 (@sonusrinivas.gowda54)

ఇంక దర్శన్ కేసుకు సంబంధించి సతీమణి విజయలక్ష్మి స్పందించారు. జైలులో ఉన్న తన భర్తను కుమారుడితో వెళ్లి కలిశారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా.. భర్త కష్టాల్లో ఉన్నాడని తన మద్దతు తెలిపింది. జైలులో కలిసి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ కూడా చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. ఇలాంటి సమయంలో దర్శన్ కు అందరి మద్దతు కావాలి అని కోరుకున్నారు. ఎవరూ ఓవర్ గా రియాక్ట్ అవ్వకండి అని సూచించారు. అలాగే అభిమానుల గురించి దర్శన్ కు చెప్పినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా భర్త కోసం విజయలక్ష్మి అభిమాలకు రిక్వెస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Shambhavi.srinivasgowda54 (@sonusrinivas.gowda54)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి