iDreamPost

అద్భుతమైన ప్లాన్‌.. ఒక్క రీఛార్జ్‌తో 300+ టీవీ ఛానెళ్లు, 22 OTT సబ్‌స్క్రిప్షన్‌, డేటా ఫ్రీ!

  • Published Jun 28, 2024 | 4:37 PMUpdated Jun 28, 2024 | 4:37 PM

Excitel Cable Cutter Plan: ఎయిర్‌టెల్‌, జియోలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు పెంచడంతో.. వాటికి గట్టి పోటీ ఇవ్వడం కోసం ఒక కంపెనీ అద్భుతమైన ప్లాన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్క రీఛార్జ్‌తో 300+ టీవీ ఛానెళ్లు, 22 OTT సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా పొందవచ్చు. ఆ ప్లాన్‌, కంపెనీ వివరాలు మీ కోసం..

Excitel Cable Cutter Plan: ఎయిర్‌టెల్‌, జియోలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు పెంచడంతో.. వాటికి గట్టి పోటీ ఇవ్వడం కోసం ఒక కంపెనీ అద్భుతమైన ప్లాన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్క రీఛార్జ్‌తో 300+ టీవీ ఛానెళ్లు, 22 OTT సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా పొందవచ్చు. ఆ ప్లాన్‌, కంపెనీ వివరాలు మీ కోసం..

  • Published Jun 28, 2024 | 4:37 PMUpdated Jun 28, 2024 | 4:37 PM
అద్భుతమైన ప్లాన్‌.. ఒక్క రీఛార్జ్‌తో 300+ టీవీ ఛానెళ్లు, 22 OTT సబ్‌స్క్రిప్షన్‌, డేటా ఫ్రీ!

నేటి కాలంలో ఇంటి అవసరాలు మాత్రమే అదనపు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొబైల్‌ రీఛార్జ్‌, టీవీ రీఛార్జ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఖర్చు. ఇవి కూడా తప్పనిసరి ఖర్చులుగా మారాయి. ఇక ఇప్పటికే జియో, ఎయిర్‌టెర్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఖర్చులన్నింటిని కలుపుకుంటే జేబుకు భారీగా చిల్లు పడే పరిస్థితి నెలకొని ఉంది. ఈక్రమంలో వినియోగదారులు మొబైల్‌ రీఛార్జ్‌, టీవీ రీఛార్జ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు అన్నింటికి కలిపి వచ్చే ప్లాన్స్‌ కోసం వెతుకుతున్నారు. మరి మీకు కూడా అలాంటి ప్లాన్‌ కావాలంటే ఇది తీసుకొండి. దీనిలో ఒక్క రీఛార్జ్‌ ద్వారా.. 300 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్స్‌, 22కు పైగా ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. దాంతో పాటు డేటా పొందే అవకాశం ఉంది. ఇంతకు ఆ ప్లాన్‌ ఏది.. ఏ కంపెనీ దాన్ని తీసుకు వచ్చింది అంటే..

ఈ అద్భుతమైన ప్లాన్‌ తీసుకువచ్చింది ఎక్సైటెల్‌ కంపెనీ. ఇంటర్నెట్ సేవలు అందించే ‘ఎక్సైటెల్’ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల పై పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 35 పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. తాజాగా ఎక్సైటెల్‌ అమెజాన్‌తో కలిసి కేబుల్‌ కట్టర్‌ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. వినియోగదారులు 300 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 22 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లు, 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా యాక్సెస్ పొందుతారు. ఎయిర్‌టెల్‌, జియోలకు పోటీగా.. ఎక్సైటెల్‌ ఈ కొత్త ప్లాన్స్‌ను తీసుకు వచ్చింది. 3, 6 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది.  3 నెలల వ్యాలిడిటీ ప్లాన్‌ కోసం అయితే నెలకు 1119 రూపాయలు, 6 నెలల ప్లాన్‌ కోసం అయితే నెలకు రూ.769 చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్సైటెల్‌ ప్రవేశపెట్టిన ఈ కేబుల్ కట్టర్ ప్లాన్ వైఫై రూటర్‌తో వస్తుంది. వినియోగదారుకు ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంటే అపరిమిత స్థానిక ఎస్‌టీడీ ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వాటితో పాటుగా ఈ ప్లాన్ ద్వారా 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు 22+ ఓటీటీయాప్ సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

వీటిల్లో అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ హాట్‌ స్టార్‌, సోనీలైవ్‌, ఏఎల్‌టీబాలాజీ, సన్‌నెక్స్ట్‌, అహా తెలుగు, డిట్టో టీవీ, డాక్యూబ్‌, ప్లేఫ్లిక్స్‌, షార్ట్‌టీవీ, ఆవోన్‌నెక్స్ట్‌, ఫ్యాన్‌ కోడ్‌, హార్ట్‌, స్టేజ్‌, ఐస్‌స్ట్రీమ్‌, ఓటీటీ ప్లే, ఈటీవీ విన్‌, బిగ్‌ఫిక్స్‌, జీ 5, ఎపిక్‌ ఆన్‌, షేమారూమీ ఓటీటీ యాప్‌లు ఈ ప్లాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయి. అలానే ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. వినియోగదారులు టీవీల్లో లైవ్ టీవీని చూస్తూ మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లలో ఓటీటీ కంటెంట్‌ను కూడా ఎంజాయ్‌ చేయవచ్చు.

ప్రస్తుతం ఎక్సైటెల్‌ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో తన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే తన సర్వీసులను చెన్నైకి కూడా విస్తరించనుంది. ఈ కంపెనీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ప్లాన్స్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వీటిని రీఛార్జ్‌ చేసుకుంటే.. కేవలం హై స్పీడ్‌ డేటాను మాత్రమే పొందగలం. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ రాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి