iDreamPost

Rohit Sharma: సౌతాఫ్రికాను ఓడించాలంటే అదొక్కటే దారి.. రోహిత్​కు గంగూలీ సజెషన్!

  • Published Jun 28, 2024 | 9:12 PMUpdated Jun 28, 2024 | 9:12 PM

టీమిండియా ఫైనల్​ ఫైట్​కు సిద్ధమవుతోంది. సెమీస్​లో ఇంగ్లండ్​ను చిత్తు చేసి జోష్​లో ఉన్న భారత్.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​ కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతోంది రోహిత్ సేన.

టీమిండియా ఫైనల్​ ఫైట్​కు సిద్ధమవుతోంది. సెమీస్​లో ఇంగ్లండ్​ను చిత్తు చేసి జోష్​లో ఉన్న భారత్.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​ కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతోంది రోహిత్ సేన.

  • Published Jun 28, 2024 | 9:12 PMUpdated Jun 28, 2024 | 9:12 PM
Rohit Sharma: సౌతాఫ్రికాను ఓడించాలంటే అదొక్కటే దారి.. రోహిత్​కు గంగూలీ సజెషన్!

టీ20 ప్రపంచ కప్​లో భారత జట్టుకు ఎదురు లేకుండా పోయింది. గత కొన్ని వారాలుగా అందర్నీ ఎంటర్​టైన్ చేస్తున్న మెగాటోర్నీలో టీమిండియా హవా నడుస్తోంది. మొదటి మ్యాచ్ ​నుంచి ఇప్పటిదాకా ఆడిన వాటిల్లో ఒక్క దాంట్లోనూ రోహిత్ సేన ఓడిపోలేదు. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్​, యూఎస్​ను ఓడించింది మెన్ ఇన్ బ్లూ. ఆ తర్వాత సూపర్-8లో ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల పని పట్టింది. కీలకమైన సెమీస్​లో ఇంగ్లండ్​ను చిత్తు చేసింది భారత్. తీవ్ర ఒత్తిడి, విపరీతమైన అంచనాల మధ్య బరిలోకి మన జట్టు బట్లర్ సేనను అలవోకగా ఓడించింది. 68 పరుగుల తేడాతో ఆ టీమ్​ను మట్టికరిపించి ఫైనల్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది రోహిత్ సేన.

నాకౌట్​ ఫైట్​లో ఇంగ్లండ్​ను చిత్తు చేసి జోష్​లో ఉన్న భారత్.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​ కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతోంది టీమిండియా. బౌలింగ్, బ్యాటింగ్​లో బలంగా ఉన్న ప్రొటీస్​ను మట్టికరిపించేందుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఒక్కో ప్లేయర్​ కోసం ఒక్కో వ్యూహం పన్నుతోంది. ఈసారి ఎలాగైనా కప్పు మిస్ అవ్వొద్దనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా కూడా మన జట్టులాగే ఓటమి లేకుండా ఫైనల్​కు వచ్చింది. కాబట్టి ఆ టీమ్​ను అస్సలు లైట్ తీసుకోవడం లేదు. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కీలకమైన సలహా ఇచ్చాడు లెజెండ్ సౌరవ్ గంగూలీ. తుదిపోరులో సఫారీలను చిత్తు చేయాలంటే దూకుడు మంత్రం పాటించాల్సిందేనని సూచించాడు.

‘సెమీస్​లో ఇంగ్లండ్​పై భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్​ను ముందుండి నడిపించిన విధానం సూపర్. అతడి బ్యాటింగ్ అమోఘం. బ్రిలియంట్ ఇన్నింగ్స్​తో అలరించాడు. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్ ఫైట్​లోనూ అతడు ఇలాగే ఆడతాడని ఆశిస్తున్నా. తుదిపోరులో భారత్ నెగ్గుతుందని నమ్ముతున్నా. ఈ మ్యాచ్​లో మన జట్టు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలి’ అని దాదా చెప్పుకొచ్చాడు. దేనికీ భయపడకుండా ఫియర్​లెస్ అప్రోచ్​తో ముందుకెళ్లాలని సజెషన్ ఇచ్చాడు. రోహిత్ శర్మ విషయంలో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పాడు గంగూలీ. 6 నెలల కింద అతడు ముంబై ఇండియన్స్​ టీమ్​ కెప్టెన్సీని కోల్పోయాడని.. కానీ ఇప్పుడు భారత జట్టును ఓటమి అనేదే లేకుండా వరల్డ్ కప్ ఫైనల్​కు చేర్చాడని మెచ్చుకున్నాడు. మరి.. స్వేచ్ఛగా ఆడితే భారత్​కు తిరుగుండదంటూ దాదా చేసిన సూచనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి