iDreamPost

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ లో నిద్రపోవాలంటే ఈ విషయం తెలుసుకోవాలి..

  • Published Jun 28, 2024 | 7:53 PMUpdated Jun 28, 2024 | 7:53 PM

Indian Railway: ఇండియాన్ రైల్వే సర్వీస్ లో ప్రయాణికులు అసౌకర్యంకు గురవ్వకుండా ఉండేందుకు రైల్వే శాఖ తగిన సౌకర్యాలు అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఇండియన్ రైల్వే సర్వీస్ పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ అలర్డ్ ను జారీ చేసింది. ఇక నుంచి రైళ్లలో ఆ సమయాలు మారనున్నాయని ప్రకటించింది.

Indian Railway: ఇండియాన్ రైల్వే సర్వీస్ లో ప్రయాణికులు అసౌకర్యంకు గురవ్వకుండా ఉండేందుకు రైల్వే శాఖ తగిన సౌకర్యాలు అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఇండియన్ రైల్వే సర్వీస్ పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ అలర్డ్ ను జారీ చేసింది. ఇక నుంచి రైళ్లలో ఆ సమయాలు మారనున్నాయని ప్రకటించింది.

  • Published Jun 28, 2024 | 7:53 PMUpdated Jun 28, 2024 | 7:53 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ లో నిద్రపోవాలంటే ఈ విషయం తెలుసుకోవాలి..

అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో ఇండియాన్ రైల్వే కూడా ఒకటి. కాగా, ఇక్కడ తరుచు కోట్లాది మంది ప్రయాణికులు ఈ రైల్వే సర్వీస్ ను వినియోగిస్తూ.. తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగాదూర ప్రాంతాలకు తొందరగా, సురక్షితంగా వెళ్లేందుకు ఈ ట్రైన్ జర్నీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. పైగా బస్సలు, ఆటోలు టికెట్ ఛార్జ్ లతో పొలిస్తే.. రైళ్ల టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక ఎక్కువ శాతం మంది ప్రయాణికులు ఈ ట్రైన్ జర్నీకే ఆసక్తి చూపుతారు.అంతేకాకుండా.. ఈ రైలు ప్రయాణంలో ప్రయాణికులు అసౌకర్యంకు గురవ్వకుండా ఉండేందుకు రైల్వే శాఖ తగిన సౌకర్యాలు అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఇండియన్ రైల్వే సర్వీస్ పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ అలర్డ్ ను జారీ చేసింది. ఇక నుంచి రైళ్లలో ఆ సమయాలు మారనున్నాయని ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఇండియన్ రైల్వే సర్వీస్  మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్ల స్లీప్ టైమింగ్స్‌ మార్చనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ రూల్స్ కు సంబంధించి కొన్ని సవరణలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ఉండే మిడిల్, సైడ్ లోయర్ బెర్త్‌లలో ఉండే ప్రయాణికులకు ఎక్కువ సేపు పడుకోవద్దని వెల్లడించింది. అలాగే ఈ మేరకు ఈ రూల్స్ ను రివైజ్ కూడా చేసింది. అయితే ఈ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇతర బర్త్ ల ప్యాసింజర్లకు కాస్త ఊరట కలగనుంది. ఎందుకంటే..సాధారణంగా రైళ్లలో అప్పర్, లోయర్, మిడిల్ అనే మూడు బెర్తులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఏసీ, స్లీపర్ కోచ్ లలో ప్యాసింజర్లకు ప్యాసింజర్లకు రైల్వే శాఖ రాత్రి సమయంలో పడుకోవడానికి బెర్త్‌ కేటాయిస్తుంది.

కానీ, ఈ బర్త్  ఓపెన్ చేస్తే లోయర్ బెర్త్ ప్యాసింజర్లు కూర్చోవడానికి అవకాశం ఉండదు. అలాగే మిడిల్ బెర్త్ ప్యాసింజర్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు పడుకుంటున్నారు. దీంతో అటూ లోయర్, అప్పర్ బెర్త్ ప్యాసింజర్లకు కూర్చోవడానికి అసౌకర్యంగా మారుతుంది. అయితే తరుచు ఈ విషయంపై ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజాగా ఈ నిర్ణయ తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ‘ఇండియన్ రైల్వేస్ కమర్షియల్ మ్యాన్యువల్’లోని మొదటి వాల్యూమ్‌లో 652వ పేరాను కూడా సవరించింది. అయితే రైల్వే శాఖ తాజా సవరణ ప్రకారం..స్లీపర్, ఏసీ కోచ్‌లలో మిడిల్ బెర్త్ కేటాయించిన ప్యాసింజర్లు ఇక నుంచి 8 గంటలు మాత్రమే పడుకోవాలి. ఇంతకుముందు ఈ సమయం 9 గంటలుగా ఉండేది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల దాకా పడుకునే వీలుండేది. కానీ, ఇప్పుడు రాత్రి 10 తర్వాతే మిడిల్ బెర్త్ ఓపెన్ చేయాలి.

అలాగే ఉదయం 6 కాగానే ప్యాసింజర్ తన మిడిల్ బెర్త్‌ క్లోజ్ చేసేయాలి. పగటి సమయంలో మిడిల్ బెర్త్ ప్యాసింజర్లు నిద్రపోకూడదు. దీంతో, 8 గంటలు పూర్తయ్యాక మిడిల్ బెర్త్‌ని క్లోజ్ చేయాలని అడిగే హక్కు లోయర్ బెర్త్ ప్యాసింజర్లకు ఉంటుంది. ఈ నియమాన్ని తప్పక పాటించాలని రైల్వే శాఖ తెలిపింది.సైడ్ లోయర్ బెర్త్ రూల్స్ విషయంలోనూ రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇక పగటి సమయంలో సైడ్ అప్పర్ బెర్త్ ప్యాసింజర్లు  కూడా లోయర్ బెర్తులో కూర్చోవచ్చు. అంతేకాకుండా.. ఆర్‌ఏసీ టికెట్ ప్యాసింజర్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. అయితే, రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్యలో మాత్రం సైడ్ అప్పర్ బెర్త్ ప్యాసింజర్లు కింద కూర్చోడానికి వీల్లేదు.ఈ బెర్త్ రూల్స్ విషయంలో కొందరికి మినహాయింపు ఇవ్వాలని ఇండియన్ రైల్వే ప్యాసింజర్లను కోరింది. కాకపోతే ఇక్కడ అంగవైకల్యం కలిగిన వారు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను ఎక్కువసేపు పడుకోవడానికి తోటి ప్రయాణికులు అనుమతించాలని సూచించింది. మరి, ప్రయాణికుల అసౌకర్యం మేరకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి