iDreamPost
android-app
ios-app

బంజారాహిల్స్‌లో ఇల్లు కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన అపార్ట్మెంట్ ధరలు!

  • Published Jun 28, 2024 | 4:49 PM Updated Updated Jun 28, 2024 | 4:49 PM

Banjara Hills Flat Rates Reduced: మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏరియాల్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని కొంతమందికి ఒక కల. అయితే బంజారాహిల్స్ లో ఫ్లాట్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఫ్లాట్ ధరలు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

Banjara Hills Flat Rates Reduced: మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏరియాల్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని కొంతమందికి ఒక కల. అయితే బంజారాహిల్స్ లో ఫ్లాట్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఫ్లాట్ ధరలు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

బంజారాహిల్స్‌లో ఇల్లు కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన అపార్ట్మెంట్ ధరలు!

‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అనేది పాత సామెత. ‘హైదరాబాద్ లో ఇంటి రెంట్ కట్టి చూడు, ఫ్లాట్ కొని చూడు’ అనేది కొత్త సామెత. అవును హైదరాబాద్ లో ఇంటి అద్దె కట్టడమన్నా.. ఇల్లు కొనాలన్నా మామూలు విషయం కాదు. వచ్చిన జీతం వచ్చినట్టే వెళ్ళిపోతుంది. చుట్టం చూపుగా వచ్చి ఒక గంట కూడా ఉండకుండానే వెళ్ళిపోతుంది. లక్షల జీతం ఉన్నా.. వేలల్లో జీతం అందరిదీ ఒకటే కథ. అయితే ఈ కథ నుంచి కొందరు బయటకు వస్తుంటారు. నెల నెలా అద్దె కట్టడం కంటే అదే రెంట్ ని ఈఎంఐ కట్టుకుంటే సొంత ఇంట్లోనే ఉండచ్చు కదా అని అనుకుంటారు. అందుకే కొంచెం రిస్క్ అయినా సరే హోమ్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు.

మీరు కూడా ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనాలి అని అనుకున్నట్లైతే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రధాన ఏరియాల్లో ధరలు తగ్గాయి. ముఖ్యంగా బంజారాహిల్స్ లో అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. బంజారాహిల్స్ లో అపార్ట్మెంట్ ధరలు తగ్గడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు రేట్లు తగ్గాయి. 2019లో ఒకసారి, 2021లో ఒకసారి, 2022లో రెండు సార్లు తగ్గింది. మళ్ళీ రెండేళ్ల తర్వాత తగ్గింది. ప్రస్తుతం బంజారాహిల్స్ లో అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. దీంతో ఫ్లాట్ కొనాలనుకునేవారికి ఉపశమనం దొరికినట్లయింది. దీంతో మీకు 8 లక్షల నుంచి 11 లక్షల వరకూ ఆదా అవుతాయి.

జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు ధర యావరేజ్ గా రూ. 10,200 ఉండేది. ఇప్పుడు అది రూ. 9,600కి తగ్గింది. చదరపు అడుగు మీద యావరేజ్ గా రూ. 600 తగ్గింది. మీరు అపార్ట్మెంట్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలనుకుంటే కనుక మీకు 7 లక్షల పైనే ఆదా అవుతుంది. అదే 3 బీహెచ్కే ఫ్లాట్ కొనాలనుకుంటే కనుక దాదాపు 11 లక్షల వరకూ ఆదా అవుతుంది. ఈ ఫ్లాట్ ధరలు మళ్ళీ పెరిగినప్పుడు మీకు 7 లక్షల నుంచి 11 లక్షల వరకూ లాభం ఉంటుంది. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి బంజారాహిల్స్ లో ఒక ఇల్లు కొనాలి అనుకుంటే కనుక ఇదే మంచి ఛాన్స్. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.