పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈడీ సోదాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. టీచర్ల నియామకం పేరిట జరిగన కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ, సన్నిహితురాలు ఆర్పితను పోలీసుులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా దర్యాప్తులో మరింత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. సోదాలు నిర్వహించే సమయంలో ఆర్పిత ఇంట్లో ఒక నలుపు రంగు డైరీని సేకరించారు. ఈ డైరీలోనే మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 40 పేజీల్లో ఉన్న సమాచారంలో చాలా విషయాలు ఉన్నాయని […]
SC కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహిత సహాయకురాలు. 2004లో మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత 2010లో సినిమాల్లోంచి తప్పుకుంది. ఆమె పార్టీ వేదికల మీద చాలాసార్లు కనిపించింది. ఆమెకు పార్టీకి అస్సలు సంబంధం లేదని టీఎంసీ చెబుతోంది అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee) గురించి బెంగాల్ రాజకీయ వర్గాల్లో చాలా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ మోడల్ కమ్ నటి నుంచి నుండి పలుకబడున్న పశ్చిమ బెంగాల్ […]
నాలుగు రాష్ట్రాల్లో ఒక లోకసభ,నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. మొత్తం అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు కొనసాగుతోంది. తుది సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోకసభ నియోజకవర్గంలో సినీ నటుడు, టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న్ సిన్హా 1.50 లక్షలకు పైగా ఆధిక్యంలో ఉండగా, ఆ రాష్ట్రంలోని బల్లిగంజ్ అసెంబ్లీ సీటులో టీఎంసీ అభ్యర్థి […]
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్ భూమ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత హత్యకు ప్రతీకారంగా అతని వర్గీయులు తీవ్ర హింస, గృహదాహనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పదిమంది సజీవ దహనమయ్యారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. అగ్నిమాపక దళాలు, పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. హత్యకు ప్రతీకారంగా దాడులు బీర్ భూమ్ […]
రాజకీయాలు మారిపోయాయి. గెలిస్తే స్వాగతించే నేతలు.. ఓడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రకటనలు చేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చింది. అన్ని నేనే చేశాను.. దేశంలోనే సీనియర్ను అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే దీనికి ఆధ్యుడు. ఆయన చూపిన బాటలో ఇతర రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు కూడా నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలే కాదు.. వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు కూడా ప్రజా తీర్పును స్వీకరించే పరిస్థితిలో లేవు. తాజాగా పశ్చిమ బెంగాల్లో […]
పశ్చిమ బెంగాల్లో బీజేపీ సహా ప్రతిపక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ జోరును తట్టుకోలేక ఆ పార్టీలు పూర్తిగా చతికిల పడ్డాయి. ఆ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 108 మున్సిపాలిటీల్లో 103 పురపాలక సంఘాల్లో టీఎంసీ జైత్రయాత్ర సాగించింది. బీజేపీ, కాంగ్రెసులకు ఒక మున్సిపాలిటీ అయినా దక్కలేదు. లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోగా మూడుచోట్ల […]
రాష్ట్రాలు, జాతీయ చట్టసభల సమావేశాలు అయితే ఉదయం లేదా మధ్యాహ్నం జరగడం సర్వసాధారణం. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత జరగడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కానీ దేశ చరిత్రలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అర్థరాత్రి దాటిన తర్వాత ప్రారంభం కానున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ అరుదైన చరిత్ర సృష్టించనుంది. అర్థరాత్రి దాటిన తర్వాత సమావేశాలు ప్రారంభించాల్సిన అవసరం ఏమిటి?.. ఏమైనా ప్రత్యేక సందర్భం ఉందా? అంటే అటువంటివేవీ లేవు. కానీ బెంగాల్ ప్రభుత్వం, […]
బెంగాల్ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే మాటల తూటాలతో కత్తులు దూసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మరో రసవత్తర సన్నివేశం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని దీదీ ఓ దీదీ అంటూ సంబోధిస్తూ ఉన్న నరేంద్ర మోడీ పేరును పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లో రాశారు. అసలు ఎఫ్ఐఆర్ లో రాయడానికి చేయడానికి గల కారణాలు ఏంటి ఒకసారి పరిశీలిద్దాం. 8 దశల్లో జరుగుతున్న పశ్చిమ […]
సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, […]
దేశంలో ఇప్పుడు అందరి చూపు పశ్చిమబెంగాల్ ఎన్నికల పై పడింది. ఇక్కడ రాజకీయాలు రోజుకోరకంగా మలుపు తిరగడం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం తో ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బిజెపిపై విమర్శల వర్షం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా […]