Nidhan
టీమిండియా టైటిల్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పొట్టి కప్పులో తిరుగులేని విజయాలతో హోరెత్తించిన రోహిత్ సేన.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.
టీమిండియా టైటిల్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పొట్టి కప్పులో తిరుగులేని విజయాలతో హోరెత్తించిన రోహిత్ సేన.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టైటిల్ ఫైట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పటివరకు మెగాటోర్నీలో తిరుగులేని విజయాలతో హోరెత్తించిన రోహిత్ సేన.. తుదిపోరులో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. అప్పుడెప్పుడో 2007లో అరంగేట్ర టీ20 వరల్డ్ కప్‌ను నెగ్గిన భారత్.. అప్పటి నుంచి ఇంకోసారి పొట్టి కప్పును కైవసం చేసుకోలేదు. పలుమార్లు సెమీస్, ఫైనల్స్ వరకు వెళ్లినా కప్పును మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. అంచనాలను అందుకోలేక ఒత్తిడికి చిత్తై ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. అయితే ఈసారి మాత్రం టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. అటు సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ నెగ్గలేదు. దీంతో ఆ టీమ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు గెలవాల్సిందేనని పంతంతో ఉంది.
రెండు జట్లు కూడా పక్కా ఢీ అంటే ఢీ అంటుండటంతో మెగా ఫైనల్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. అయితే ఒక విషయం మాత్రం టీమ్‌ను టెన్షన్ పెడుతోంది. అదే విరాట్ కోహ్లీ ఫామ్. లీగ్ దశలో దారుణంగా పెర్ఫార్మ్ చేసిన ఈ క్లాస్ బ్యాటర్.. ఆప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌పై ఫర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిలయ్యాడు. బిగ్ మ్యాచెస్‌లో చెలరేగుతాడనే పేరున్న కోహ్లీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై తుస్సుమన్నాడు. తన బలమైన టైమింగ్‌పై ఆధారపడకుండా దూకుడుగా ఆడటం, అనవసర షాట్లు బాదడం వల్ల త్వరగా ఔట్ అవుతున్నాడు విరాట్. దీంతో అతడ్ని ఫైనల్ మ్యాచ్‌లో పక్కనబెడతారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కింగ్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్ చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోహ్లీని తీసేస్తారా అనే విషయంపై లెజెండ్ సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. భారత క్రికెట్‌కు విరాట్ ఎంతో ముఖ్యమని అన్నాడు దాదా. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాదిరిగానే కోహ్లీ కూడా మన క్రికెట్‌కు మూలస్తంభం లాంటోడని తెలిపాడు. మూడ్నాలుగు మ్యాచుల్లో ఫెయిలైనంత మాత్రాన వాళ్లు బ్యాడ్ ప్లేయర్స్ అయిపోరన్నాడు. కోహ్లీ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అన్న దాదా.. ఫైనల్ మ్యాచ్‌లో అతడ్ని పక్కనబెట్టే సాహసం చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే విరాట్ విషయంలో అడ్డగోలు నిర్ణయాలు పనికి రావన్నాడు. ఫైనల్లోనూ అతడే ఓపెనర్‌గా రావాలన్నాడు. కోహ్లీ మీద నమ్మకం ఉంచాలని.. గొప్ప ఆటగాళ్లు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారని పేర్కొన్నాడు. మరి.. కోహ్లీ తప్పక రాణిస్తాడంటూ దాదా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Sourav Ganguly said – “People like Virat Kohli, Sachin Tendulkar & Rahul Dravid, they are institutions for Indian cricket. Three four matches don’t make them weaker players. Don’t rule Virat Kohli out in the final tomorrow”. (PTI). pic.twitter.com/7jI7LpG65s
— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024