Tirupathi Rao
Huge Blast In shadnagar Glass Factory: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్లాస్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు.
Huge Blast In shadnagar Glass Factory: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్లాస్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు.
Tirupathi Rao
గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆ పరిశ్రమలో 150 మంది వరకు కార్మికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాజు పరిశ్రమ కావడం.. క్షతగాత్రులను గాజు ముక్కలు తగలడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులకు తక్షణమే వైద్య సహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బూర్గుల గ్రామ శివారులో జరిగింది. స్థానికంగా ఉన్న సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కంప్రెషర్ పేలింది. ఈ పేలుడులో ఏకంగా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయాలు అయ్యాయి. మృతులు అంతా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది వరకు కార్మికులు ఉన్నారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలో ఉన్న షెడ్డు కూలిపోయింది. హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గ్లాసు ఫ్యాక్టరీ కావడంతో పేలుడుకి గాజు ముక్కలు తగిలి ఎక్కువ మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఆ కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ షాద్ నగర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సహాయకచర్యలకు సంబంధించి అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కెలక్టర్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది, పోలీసు, పరిశ్రమలు, కార్మిక, వైద్య బృందాలు తరలివెళ్లాయి. అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.