nagidream
Yuva Samrat Backstep: ఇల్లీగల్ బెట్టింగ్స్ విషయంలో హర్ష సాయి మీద ఇన్నాళ్లు పోరాటం చేసిన యువసామ్రాట్ వెనకడుగు వేశారు. ఇక హర్ష సాయి జోలికి రాను.. ఇదే చివరి వీడియో అంటూ కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందంటే?
Yuva Samrat Backstep: ఇల్లీగల్ బెట్టింగ్స్ విషయంలో హర్ష సాయి మీద ఇన్నాళ్లు పోరాటం చేసిన యువసామ్రాట్ వెనకడుగు వేశారు. ఇక హర్ష సాయి జోలికి రాను.. ఇదే చివరి వీడియో అంటూ కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందంటే?
nagidream
హర్ష సాయి అనే వ్యక్తి గురించి ఇకపై ఏ ఇంటర్వ్యూలు ఇవ్వదలచుకోలేదని.. ఏ ఛానల్ లోనూ కూర్చోదలచుకోలేదని యువసామ్రాట్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళూ హర్ష సాయి మీద ఆరోపణలు చేస్తూ.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తూ వచ్చిన యువసామ్రాట్ ఇక విసిగిపోయారో.. లేక ఎవరైనా ఇబ్బంది పెట్టారో తెలియదు గానీ హర్ష సాయి విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తన ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. హర్ష సాయి మీద తాను చేసే ఆఖరి వీడియో ఇదే అంటూ కామెంట్స్ చేశారు. ఇక నా పని అయిపోయిందని అన్నారు. అసలేం అన్నారంటే?
హర్ష సాయి మీద నాలుగేళ్లుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలు మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. హర్ష సాయి మీద వ్యతిరేకగళం వినిపించారు. హర్ష సాయి మీద చర్యలు తీసుకోవాల్సిందే.. శిక్ష పడాల్సిందే అంటూ తీవ్రంగా కామెంట్స్ చేశారు. ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారని.. హర్ష సాయి కోట్లు సంపాదించుకున్నాడని.. ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 40, 60 లక్షలు వస్తాయని అన్నారు. సేవ ముసుగులో హర్ష సాయి చేసేది మోసం అని అన్నారు. దీనిపై హర్ష సాయి కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ తర్వాత యువసామ్రాట్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. హర్ష సాయి ఎంట్రీతో యువసామ్రాట్ వెనక్కి తగ్గారా అన్న సందేహం ఫ్యాన్స్ కి కలుగుతుంది. కాగా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో హర్ష సాయి జోలికి రాను అని అన్నారు.
‘హర్ష సాయి మీద ఏ వీడియోలు, ఏ కామెంట్లు చేయదలచుకోలేదని అన్నారు. హర్ష సాయి మీద ఇదే నా ఆఖరి వీడియో. ఎందుకంటే నాలుగేళ్ల నుంచి మంచి అనే ముసుగులో దాక్కున్న విష సర్పాన్ని లాగి కోరలు పీకి రోడ్డు మీద పడేశా.. నేను బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తా.. నేను కావాలనుకుంటే ఏడాదికి 300 కోట్ల నుంచి 500 కోట్లు సంపాదిస్తా.. ఇది సేవ కాదు బిజినెస్ అని.. కాళ్ళు వణుక్కుంటూ ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో కూర్చుంటా అని అందరి ముందు ప్రూవ్ చేశాను. ఇదే నా విజయం. ఇంతకన్నా నా విజయం ఏమీ లేదు. మీకు మీడియా ఛానల్స్ కి బాధ్యత ఉంటే ఎవరిది నిజం అని తేల్చండి. ఓపెన్ గా క్రైం చేస్తా అని ఒప్పుకున్న నేరస్తుడికి శిక్ష పడేలా చేసే బాధ్యత మీది, నాది కాదు. నా పనైపోయింది. జై హింద్’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నెటిజన్స్ యువసామ్రాట్ చేసిన కామెంట్స్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. నువ్వు గెలిచావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.