iDreamPost

OTTలోకి యానిమల్ బ్యూటీ క్రేజీ మూవీ.. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు!

Tripti Dimri- Vicky Kaushal Comedy Drama Bad Newz: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ నుంచి ఒక క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉండే సరికొత్త కామెడీ డ్రామా ఇది.

Tripti Dimri- Vicky Kaushal Comedy Drama Bad Newz: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ నుంచి ఒక క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉండే సరికొత్త కామెడీ డ్రామా ఇది.

OTTలోకి యానిమల్ బ్యూటీ క్రేజీ మూవీ.. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు!

యానిమల్ మూవీ.. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. యానిమల్ పార్క్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక హీరోయిన్ తృప్తీ దిమ్రీ. సినిమాలో ఉన్నది 15 నిమిషాలే కావచ్చు. కానీ, పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పుడు ఆమె నుంచి వచ్చే ఏ మూవీ అయినా బ్రేక్ ఇవ్వడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ ఒక క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కూడా అలాంటి ఇలాంటి కాన్సెప్ట్ కాదు. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు.. వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘట్టం ఇది. మరి.. ఆ మూవీ ఎలా ఉండబోతోంది? ఎప్పుడు ఓటీటీలోకి వస్తోందో చూద్దాం.

ఈ సినిమా పేరు ‘బ్యాడ్ న్యూస్’. గతకొన్ని వారాలుగా బాలీవుడ్ సహా.. ఓటీటీ ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ పోస్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. ఇప్పుడు అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక అమ్మాయి ఇద్దరితో ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరితో హద్దులు కూడా దాటేస్తుంది. ఆ తర్వాత ఆమె గర్భం దాలుస్తుంది. అయితే ఆమెకు ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే.. ఇద్దరిలో తన బిడ్డకు తండ్రి ఎవరు? ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చాలానే కష్టపడుతుంది.

మొదట తాను తల్లి అయిన విషయాన్ని ఇద్దరికీ చెప్తుంది. కానీ, ఆ తండ్రి ఎవరు అనేది మాత్రం చెప్పలేకపోతుంది. అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడం చుట్టూ కాసేపు సినిమా జరుగుతుంది అనిపిస్తోంది. అయితే వీళ్లు డాక్టర్స్ ని కలుస్తారు. అందుకు వైద్యులు ఒక మార్గం చెప్తారు. అందుకు కొన్ని టెస్టులు కూడా చేస్తారు. ఆ టెస్టుల్లో వైద్యశాస్త్రంలోనే మహాద్భుతం వెలుగు చూస్తుంది. అదేంటంటే.. ఒక ఎగ్ లోకి రెండు కణాలు వెళ్తాయి. అది కూడా ఇద్దరు హీరోలవి. అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఇద్దరూ తండ్రులు అని తెలిసిన తర్వాత.. వారిలో ఎవరు బెస్టో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అయితే వారినే తన బిడ్డకు తండ్రిని చేయాలి అనుకుంటుంది.

అక్కడి నుంచే ఇద్దరు హీరోలు విక్కీ కౌశల్- ఎమ్మీ విర్క్ ల మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు బెస్టో తేల్చుకోవడానికి చాలానే కష్టపడతారు. అక్కడి నుంచే అసలు డ్రామా, కామెడీ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోయింది. ఈ బ్యాడ్ న్యూస్ మూవీ జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి.. ఈ బ్యాడ్ న్యూస్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి