iDreamPost

రోహిత్ కాదు.. ఫైనల్​లో భారత్​ను గెలిపించేది అతడే: మాజీ క్రికెటర్

  • Published Jun 28, 2024 | 9:55 PMUpdated Jun 29, 2024 | 3:13 PM

ప్రతిష్టాత్మక పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. భారత్-సౌతాఫ్రికా మధ్య కప్పు కోసం శనివారం ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ ఫుల్​గా ప్రిపేర్ అవుతున్నాయి.

ప్రతిష్టాత్మక పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. భారత్-సౌతాఫ్రికా మధ్య కప్పు కోసం శనివారం ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ ఫుల్​గా ప్రిపేర్ అవుతున్నాయి.

  • Published Jun 28, 2024 | 9:55 PMUpdated Jun 29, 2024 | 3:13 PM
రోహిత్ కాదు.. ఫైనల్​లో భారత్​ను గెలిపించేది అతడే: మాజీ క్రికెటర్

ప్రతిష్టాత్మక పొట్టి ప్రపంచ కప్ ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. భారత్-సౌతాఫ్రికా మధ్య కప్పు కోసం శనివారం ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ ఫుల్​గా ప్రిపేర్ అవుతున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్స్​కు చేరుకున్నాయీ రెండు జట్లు. ఇరు టీమ్స్​లోనూ బోలెడు మంది స్టార్లు ఉన్నారు. సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ను టర్న్ చేయగల యోధులు కూడా ఉన్నారు. దీంతో తుదిపోరు మరింత ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ ఆఖరి బంతి వరకు వెళ్లడం పక్కా అని చెప్పొచ్చు. వరల్డ్ కప్స్ కొద్దిలో మిస్సవుతూ వచ్చిన టీమిండియా.. ఈసారి టైటిల్​ను వదలొద్దని పట్టుదలతో ఉంది. సఫారీలను చిత్తు చేసి ఛాంపియన్​గా అవతరించాలని అనుకుంటోంది. అందుకు ప్లాన్స్​ను సిద్ధం చేస్తోంది.

ఫైనల్ మ్యాచ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కలసి వ్యూహాలు పన్నుతున్నారు. సౌతాఫ్రికా ఆయువుపట్టు అయిన బౌలింగ్​ దళాన్ని చిత్తు చేయాలని చూస్తున్నారు. మన టీమ్ బ్యాటర్లు భీకర ఫామ్​లో ఉండటంతో ప్రొటీస్​ బౌలింగ్ యూనిట్​ను తుత్తునియలు చేయొచ్చని అనుకుంటున్నారు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ వాళ్లను టెన్షన్ పెడుతోంది. మెగాటోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో కలిపి 75 పరుగులు మాత్రమే చేశాడు విరాట్. దీంతో ఫైనల్ మ్యాచ్​లోనైనా అతడు చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. ఈ తరుణంలో భారత మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తుదిపోరులో టీమిండియాను రోహిత్ కాదు.. విరాటే గెలిపిస్తాడని అన్నాడు.

‘కోహ్లీ ఫామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతడు రాజులకే రాజు. ఫైనల్ మ్యాచ్​లో అతడు తన బెస్ట్ ఇస్తాడు’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పాడు. మూడ్నాలుగు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన అతడి ఫామ్ గురించి గాభరా పడనక్కర్లేదని తెలిపాడు. అతడో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యాడు. కోహ్లీని టీమ్​లో నుంచి తీసేయడం లాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు. అతడి లాంటి ఆటగాళ్లు లైఫ్ టైమ్​లో ఒకేసారి వస్తారన్నాడు. విరాట్ నుంచి బిగ్ ఇన్నింగ్స్ రావడం పక్కా అని వ్యాఖ్యానించాడు దాదా. ఇండియన్ క్రికెట్​కు అతడు ఎంతో కీలకమని.. విరాట్​పై నమ్మకం ఉంచాలన్నాడు. మరి.. ఫైనల్ మ్యాచ్​లో కోహ్లీ భారత్​ను గెలిపిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి