iDreamPost

యువసామ్రాట్ రవి, షణ్ముఖ్ జశ్వంత్‌లపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Natraj Master On Yuvasamrat, Shanmukh: యువసామ్రాట్ రవి హర్ష సాయిపై ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యువసామ్రాట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలానే షణ్ముఖ్ జశ్వంత్ పై కూడా కామెంట్స్ చేశారు. మరి షణ్ముఖ్ కి, యువసామ్రాట్ లపై నటరాజ్ మాస్టర్ కామెంట్స్ ఎందుకు చేసినట్టు?

Natraj Master On Yuvasamrat, Shanmukh: యువసామ్రాట్ రవి హర్ష సాయిపై ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యువసామ్రాట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలానే షణ్ముఖ్ జశ్వంత్ పై కూడా కామెంట్స్ చేశారు. మరి షణ్ముఖ్ కి, యువసామ్రాట్ లపై నటరాజ్ మాస్టర్ కామెంట్స్ ఎందుకు చేసినట్టు?

యువసామ్రాట్ రవి, షణ్ముఖ్ జశ్వంత్‌లపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

యువసామ్రాట్ రవి గత కొన్ని రోజులుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిపై అనేక ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. హర్ష సాయి, భయ్యా సన్నీయాదవ్ ల మీద యువసామ్రాట్ రవి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువసామ్రాట్ చేసిన వ్యాఖ్యలతో కొంతమంది ఏకీభవిస్తుండగా.. మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే తనపై యువసామ్రాట్ చేస్తున్న ఆరోపణలపై హర్ష సాయి స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే యువసామ్రాట్ రవిపై, షణ్ముఖ్ జశ్వంత్ పై నటరాజ్ మాస్టర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నటరాజ్ మాస్టర్ ఇలా షణ్ముఖ్ పై, యువసామ్రాట్ పై కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి?

ట్రూత్ అండ్ డేర్ విత్ జెస్సీ ప్రోగ్రాంలో భాగంగా నటరాజ్ మాస్టర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ జశ్వంత్ జెస్సీ నటరాజ్ మాస్టర్ ని ట్రూత్ అండ్ డేర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో మొదటిది షణ్ముఖ్ గురించి అడిగారు. ‘నీకు బాగా క్లోజ్ అయిన షణ్ముఖ్ గురించి, అతనిలో నచ్చనిది, నెగిటివ్ క్వాలిటీ గురించి చెప్పు’ అంటూ జశ్వంత్ జెస్సీ అడగ్గా దానికి నటరాజ్ మాస్టర్ ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘అవసరం ఉంటేనే మనిషితో మాట్లాడతాడని.. మనిషితో అవసరం ఉంటేనే అతనితో క్లోజ్ గా మూవ్ అవుతాడని.. అవసరం లేకపోతే మనిషిని పురుగుని చూసినట్టు చూస్తాడని.. అది తనకు తెలిసిన బ్యాడ్ క్వాలిటీ అని నటరాజ్ మాస్టర్ కామెంట్స్ చేశారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో యువసామ్రాట్ రవి గురించి మాట్లాడుతూ తన పని తాను చేసుకోకుండా ఎందుకు బయటకొస్తున్నాడో అర్థం కావడం లేదంటూ నటరాజ్ మాస్టర్ కామెంట్స్ చేశారు. ఇంకా అతన్ని గట్టిగానే తిడుతూ రెచ్చిపోయారు.

ఈ ప్రోమో వీడియోని జశ్వంత్ జెస్సీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. రేపు ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువసామ్రాట్ రవి ఆరోపణలపై హర్ష సాయి స్పందించారంటే అర్ధం ఉంది. కానీ నటరాజ్ మాస్టర్ కామెంట్స్ చేయడానికి కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై యువసామ్రాట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే నటరాజ్ మాస్టర్ యువసామ్రాట్ పై ఫైర్ అయ్యినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ రిలీజైతే ఇంకేం కామెంట్స్ చేశారో అనేది తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ గురించి ఏమైనా కామెంట్స్ చేశారో లేదో అనేది తెలుస్తుంది. మరి యువసామ్రాట్ పై, అలానే షణ్ముఖ్ జశ్వంత్ పై నటరాజ్ మాస్టర్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by jaswanth padala (jessie) (@jaswanth_jessie)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి