iDreamPost

Virat Kohli: కప్పు కొట్టాలంటే కోహ్లీ ప్లేస్​లో అతడ్ని ఓపెనర్​గా దించాలి.. అక్తర్ కీలక సూచన!

  • Published Jun 28, 2024 | 10:15 PMUpdated Jun 28, 2024 | 10:50 PM

టీ20 వరల్డ్ కప్​లో ఫైనల్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. ఓటమి అనేది లేకుండా తుదిపోరు వరకు వచ్చిన రోహిత్ సేన.. ఇదే జోష్​లో సౌతాఫ్రికాను చిత్తు చేసి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

టీ20 వరల్డ్ కప్​లో ఫైనల్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. ఓటమి అనేది లేకుండా తుదిపోరు వరకు వచ్చిన రోహిత్ సేన.. ఇదే జోష్​లో సౌతాఫ్రికాను చిత్తు చేసి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

  • Published Jun 28, 2024 | 10:15 PMUpdated Jun 28, 2024 | 10:50 PM
Virat Kohli: కప్పు కొట్టాలంటే కోహ్లీ ప్లేస్​లో అతడ్ని ఓపెనర్​గా దించాలి.. అక్తర్ కీలక సూచన!

టీ20 వరల్డ్ కప్​లో ఫైనల్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. ఓటమి అనేది లేకుండా తుదిపోరు వరకు వచ్చిన రోహిత్ సేన.. ఇదే జోష్​లో సౌతాఫ్రికాను ఓడించి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది. అటు ప్రొటీస్ కూడా ఇదే ఫీలింగ్​లో ఉంది. ఎందుకంటే ఆ టీమ్ కూడా ఓటమి అనేదే లేకుండా ఫైనల్​కు దూసుకొచ్చింది. రెండు టీమ్స్ నిండా స్టార్ ప్లేయర్లు ఉండటం, అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండటంతో ఇది సమవుజ్జీల మధ్య పోరుగా కనిపిస్తోంది. అయితే స్పిన్ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తోంది. అటు సౌతాఫ్రికా టీమ్ పేస్ బౌలింగ్​లో స్ట్రాంగ్​గా ఉంది. ఇరు టీమ్స్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్​లో ఉన్నారు. అయితే టీమిండియాను ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. ఒక ఓపెనర్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతున్నాడు.

రోహిత్ సెన్సెషనల్ బ్యాటింగ్​తో అదరగొడుతున్నాడు. కానీ మరో ఓపెనర్ విరాట్ కోహ్లీనే తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటిదాకా వరల్డ్ కప్​లో ఆడిన మ్యాచుల్లో కలిపి అతడు చేసిన పరుగులు 75 మాత్రమే. దీన్ని బట్టే విరాట్ ఎంత పేలవంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అతడ్ని తీసేసి యశస్వి జైస్వాల్​ లేదా సంజూ శాంసన్​ల్లో ఒకర్ని ఓపెనర్​గా ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పాకిస్థాన్ లెజెండ్ షోయబ్ అక్తర్ రియాక్ట్ అయ్యాడు. మెగాటోర్నీలో భారత్ ఆడుతున్న తీరును అతడు మెచ్చుకున్నాడు. కప్పు కొట్టేందుకు టీమిండియాకు పూర్తి అర్హత ఉందన్నాడు. అయితే కప్పు కొట్టాలంటే ఫైనల్ మ్యాచ్​లో ఓపెనింగ్ స్లాట్ విషయంలో ఓ మార్పు చేయాల్సిందేనని చెప్పాడు.

కోహ్లీని తీసేసి పించ్ హిట్టర్ రిషబ్ పంత్​ను ఓపెనర్​గా ఆడించాలని అక్తర్ సూచించాడు. హిట్​మ్యాన్​కు జతగా పంత్​ను ఓపెనర్​గా దించాలని.. టీమ్​కు తిరుగుండదని చెప్పాడు. ‘రోహిత్ శర్మతో కలసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తే గొప్పగా ఉంటుంది. దీని వల్ల కోహ్లీ తనకు అలవాటైన మూడో నంబర్​లో బ్యాటింగ్​ చేయొచ్చు. ఆ స్థానంలో ఆడుతూ అతడు టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. కాబట్టి ఫైనల్ మ్యాచ్​లోనూ విరాట్​ను అదే పొజిషన్​లో ఆడిస్తే బెటర్. క్రీజులో నిలదొక్కుకోవడానికి అతడికి కొంత టైమ్ అవసరం. మూడో నంబర్​లో ఆడితే ఈ వెసులుబాటు ఉంటుంది. అతడు న్యాచురల్ ఓపెనర్ కాదు. ఓపెనర్​గా వచ్చి ఇన్నింగ్స్​ను మొదలుపెట్టడం కోహ్లీ బ్యాటింగ్ స్టైల్​కు సెట్ అవ్వదు. క్రీజులో సెటిల్ అయ్యాక చెత్త బంతులు వస్తే బౌండరీలు కొడుతూ అతడు టచ్​లోకి వస్తాడు’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ ప్లేస్​లో పంత్ ఓపెనర్​గా రావడమే కరెక్ట్ అంటూ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి