iDreamPost

OTT Web Series : సరికొత్త పాత్రలో శ్రియా.. ఈ సిరీస్ చాలా స్పెషల్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Jun 28, 2024 | 7:49 PMUpdated Jun 28, 2024 | 7:49 PM

వెండి తెరపైన కనిపించిన ఎంతో మంది నటి నటులు ఓటీటీ లోకి వచ్చేస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ శ్రీయ శరన్ నటించిన షో టైం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

వెండి తెరపైన కనిపించిన ఎంతో మంది నటి నటులు ఓటీటీ లోకి వచ్చేస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ శ్రీయ శరన్ నటించిన షో టైం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 28, 2024 | 7:49 PMUpdated Jun 28, 2024 | 7:49 PM
OTT Web Series : సరికొత్త పాత్రలో శ్రియా.. ఈ సిరీస్ చాలా స్పెషల్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ లో అప్పటికి ఇప్పటికి శ్రీయ శరన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి.. ఇప్పుడు తీస్తున్న సినిమాలు తక్కువే. కానీ ఈ మధ్య ఆమె హిందీలో నటించిన షో టైమ్ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి కేవలం నాలుగు ఎపిసోడ్స్ నే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మిగిలిన ఎపిసోడ్స్ ను జులై 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో.. దానికి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం.

షో టైమ్ వెబ్ సిరీస్ గురించి ఆల్రెడీ ఇప్పటివరకు అందరూ వినే ఉంటారు. బాలీవుడ్ తెర వెనుక అసలు ఏం జరుగుతుంది అనే కథలను తెరమీద చూపించే ప్రయత్నమే ఈ షో టైమ్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో.. ఇమ్రాన్ హష్మితోపాటు శ్రియ, మహిమా మఖ్వానా, రాజీవ్ ఖండేల్వాల్ లాంటి ఎంతో మంది ప్రముఖ నటులు.. నటించారు. విక్టరీ స్టూడియోస్, దాని వారసత్వ హక్కుల కోసం ఇద్దరు అన్న చెల్లెళ్ళ మధ్య జరిగిన పోరాటమే ఈ వెబ్ సిరీస్. ఇప్పటికి ఈ వెబ్ సిరీస్ నుంచి కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ నాలుగు ఎపిసోడ్స్ కు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక జులై 12 నుంచి మిగిలిన అన్ని ఎపిసోడ్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ పార్ట్ 2 కోసం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ను గమనిస్తే.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఎపిసోడ్స్ లో చూపించిన వైలెన్స్ కంటే కూడా ఇంకాస్త ఎక్కువే ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమా ప్రపంచం తెర వెనుక జరిగే పూర్తి కథలు, ఘర్షణలు, సొంత వాళ్ళ మధ్య విభేదాలు ఇలాంటి వారి గురించి పూర్తిగా తెలియాలంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ ను అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. సాధారణంగా వెబ్ సిరీస్ లంటే అన్ని ఎపిసోడ్స్ ను ఒకేసారి రిలీజ్ చేస్తారు. కానీ, ఈ సిరీస్ మాత్రం సరిగ్గా ఓ మంచి సస్పెన్స్ దగ్గర ఇంటర్వెల్ సీన్ ఎలా వస్తుందో.. ఈ సిరీస్ ను కూడా అలానే ఆపేసారు. ఇప్పుడు ఈ సిరీస్ మిగిలిన ఎపిసోడ్స్ ను 2వ పార్ట్ లా రిలీజ్ చేయనున్నారు. కాబట్టి మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి షో టైమ్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి