iDreamPost

కల్కి 2898 AD మూవీకి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ!

Minister Komatireddy Venkat Reddy Kalki 2898 AD Review: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్కి సినిమా చూశారు. ఆ తర్వాత సినిమాపై తన రివ్యూని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Minister Komatireddy Venkat Reddy Kalki 2898 AD Review: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్కి సినిమా చూశారు. ఆ తర్వాత సినిమాపై తన రివ్యూని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కల్కి 2898 AD మూవీకి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా అభిమానులు కల్కి 2898 AD మూవీ గురించే మట్టాడుకుంటున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ సైంటిఫిక్ మూవీకి అంతా ఫిదా అవుతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కల్కి విజువల్ వండర్ కు ఇంప్రెస్ అయ్యారు. కుటుంబసమేతంగా కల్కి సినిమా చూసిన ఆయన.. తన రివ్యూని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విజువల్ వండర్ అంటూ కితాబిచ్చారు. అలాగే కల్కిలాంటి సినిమాలతో ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అన్నారు. అంతేకాకుండా.. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి అంటూ వ్యాఖ్యానించారు.

కల్కి 2898 ఏడీ మూవీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ఐడియాలజీకి, టేకింగ్ కి, సినిమాలో ఉన్న విజువల్స్ కు ఫిదా అయిపోతున్నారు. తొలిరోజు ఈ కల్కి సినిమా ఏకంగా రూ.191.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. నాన్ హాలిడే రోజు, నాన్ వీకెండ్ లో ఇలాంటి కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు అని ట్రేడ్ పండితులు ప్రశంసిస్తున్నారు. అలాగే తొలిరోజు ఇంతటి భారీ కలెక్షన్స్ రాబట్టిన మూడో చిత్రంగా కల్కి 2898 ఏడీ రికార్డులు క్రియేట్ చేసింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు అంటున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సినిమాకి రివ్యూ ఇచ్చారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టు ఇలా ఉంది. “ఈరోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాను కుటుంబసమేతంగా చూశాను. మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణే వంటి తారాగణం అద్భుతంగా నటించారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో అశ్వినీ దత్, స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న కల్కి 2898 ఏడీ సినిమా ఓ విజువల్ వండర్.

ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది. లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ కల్కి సినిమా వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోరుకుంటున్నాను” అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మరి.. కల్కి సినిమా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి