Nidhan
India vs South Africa: భారత జట్టు అసలైన సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచులన్నీ ఒకెత్తు.. ఇప్పుడు ఆడబోయేది మరొకెత్తు. ఈ ఒక్కదాంట్లో నెగ్గితే చాలు ఛాంపియన్స్‌గా అవతరిస్తుంది టీమిండియా.
India vs South Africa: భారత జట్టు అసలైన సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచులన్నీ ఒకెత్తు.. ఇప్పుడు ఆడబోయేది మరొకెత్తు. ఈ ఒక్కదాంట్లో నెగ్గితే చాలు ఛాంపియన్స్‌గా అవతరిస్తుంది టీమిండియా.
Nidhan
భారత జట్టు అసలైన సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచులన్నీ ఒకెత్తు.. ఇప్పుడు ఆడబోయేది మరొకెత్తు. ఈ ఒక్కదాంట్లో నెగ్గితే చాలు ఛాంపియన్స్‌గా అవతరిస్తుంది టీమిండియా. అందని ద్రాక్షగా మారిన ఐసీసీ టైటిల్‌ను నెగ్గేందుకు రోహిత్ సేనకు ఇది గోల్డెన్ ఛాన్స్. టీ20 వరల్డ్ కప్-2024లో ఓటమి అనేది లేకుండా అప్రతిహత విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది మెన్ ఇన్ బ్లూ. లీగ్ స్టేజ్‌లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాను ఓడించిన భారత్.. సూపర్-8లో ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఫేవరెట్ ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేసింది. ఎన్నో అంచనాలు, తీవ్ర ఒత్తిడి మధ్య సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో సౌతాఫ్రికాను కూడా ఓడిస్తే భారత్ జగజ్జేతగా అవతరిస్తుంది.
మెగాటోర్నీలో టీమిండియా ఆటతీరును చూసిన అభిమానులు.. ఈసారి మన జట్టు కప్పు కొట్టడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఇంత తోపు ఫామ్‌లో ఉన్న టీమ్‌ను ఆపడం సఫారీల వల్ల కాదని అంటున్నారు. ప్లేయర్లు, ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫైనల్ మరొకరికి కూడా కీలకం కానుంది. గత కొన్ని నెలలుగా భారత జట్టు వెంట ఉంటూ టీమ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఓ వ్యక్తికి వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ డే కానుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆయన టీమ్‌తో ట్రావెల్ కాడు. ఆ పర్సన్ ఎవరో ఈపాటికే మీరు ఊహించి ఉంటారు. ఆయన మరెవరో కాదు.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. అవును, పొట్టి కప్పు ఫైనల్ మ్యాచ్‌తో కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఫైనల్ మ్యాచే కోచ్‌గా అతడికి ఆఖరి రోజు అవనుంది.
ద్రవిడ్ హయాంలో భారత జట్టు ఎన్నో అద్భుత విజయాలు అందుకుంది. అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ టీమ్ రేంజ్‌కు చేరుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు వన్డే ప్రపంచ కప్-2023లో ఫైనల్స్‌కు చేరుకుంది. కప్పు నెగ్గకపోయినా టీమ్ ఆడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ఆసియా కప్ కూడా గెలిచింది రోహిత్ సేన. ఇంకా ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విక్టరీలు కొట్టింది. యువకులు, సీనియర్ల మేళవింపుతో టీమ్‌కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకొచ్చిన మిస్టర్ కూల్.. రికార్డులు కాదు జట్టు గెలుపే ముఖ్యంగా ఆడేలా ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. అలాంటోడు టీమ్‌ను వీడే టైమ్ వచ్చేసింది. దీంతో ప్రపంచ కప్ గెలిచి అతడికి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత క్రికెట్‌కు ఇన్ని సేవలు అందించిన ద్రవిడ్‌కు కప్పు ఇవ్వడమే బిగ్ గిఫ్ట్ అని చెబుతున్నారు. మరి.. టీమిండియా ద్రవిడ్‌కు టైటిల్‌ను బహుమతిగా ఇస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Farewell, Rahul Dravid. 🥹❤️
– Thank you for each and every memory, one final time with team India tomorrow. 🇮🇳pic.twitter.com/OezOTUJp64
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024