iDreamPost

అంతా సోషల్‌ మీడియా హైప్‌! అతను నా కంటే చెత్త ప్లేయర్‌: పాక్‌ క్రికెటర్‌

  • Published Jun 13, 2024 | 3:12 PMUpdated Jun 13, 2024 | 3:12 PM

Ahmad Shahzad, Babar Azam, Pakistan, T20 World Cup 2024: ఓ స్టార్‌ క్రికెటర్‌పై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అతను కింగ్‌ కాదని.. తనకంటే వరెస్ట్‌ ప్లేయర్‌ అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చెత్త ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ahmad Shahzad, Babar Azam, Pakistan, T20 World Cup 2024: ఓ స్టార్‌ క్రికెటర్‌పై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అతను కింగ్‌ కాదని.. తనకంటే వరెస్ట్‌ ప్లేయర్‌ అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చెత్త ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 13, 2024 | 3:12 PMUpdated Jun 13, 2024 | 3:12 PM
అంతా సోషల్‌ మీడియా హైప్‌! అతను నా కంటే చెత్త ప్లేయర్‌: పాక్‌ క్రికెటర్‌

అతను ఒక ఫేక్‌ కింగ్‌.. అంతా సోషల్‌ మీడియా హైప్‌.. కనీసం నేను ఆడినంత బాగా కూడా ఆడలేదు, నేనే చెత్త ప్లేయర్‌ అంటే అతను నాకంటే చెత్త ప్లేయర్‌ అంటూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అహ్మద్‌ షాజాద్‌ అన్నాడు. ఇంతకీ ఈ పాక్‌ ప్లేయర్‌ తిట్టేది ఎవర్నో తెలుసా? పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ని. ఇండియాలో విరాట్‌ కోహ్లీని ఎలాగైతే కింగ్‌ కోహ్లీ అని పిలుస్తారో.. పాకిస్థాన్‌లో బాబర్‌ ఆజమ్‌ను క్రికెట్‌ అభిమానులు కింగ్ అంటూ ఉంటారు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అతని చెత్త ప్రదర్శనతో పాటు అతను కెప్టెన్‌ అయినప్పటి నుంచి పాక్‌ టీమ్‌ ఎలా సర్వనాశనం అయిందో వివరిస్తూ.. షాజాద్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

బాబర్‌ ఆజమ్‌ తన స్నేహితులకు జాతీయ జట్టులో చోలు కల్పించేందుకు పాకిస్థాన్‌ దేశవాళి టోర్నీల్లో బాగా ఆడిన ఆటగాళ్లను పక్కనపెట్టేశాడని, అతన ఫ్రెండ్స్‌ బ్యాటింగ్‌ చేయకుంటే, బౌలర్‌గా.. బౌలింగ్‌ సరిగా చేయకుంటే ఫీల్డర్‌గా టీమ్‌లో ఉంచుకున్నాడని.. అయినా కూడా వాళ్లు సరిగ్గా ఆడటం లేదుని అహ్మద్ షాజాద్ మండిపడ్డాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తాను ఏం కోరినా ఇచ్చిందని చెప్పిన బాబర్‌ దేశం కోసం ఏం చేశాడో చెప్పాలని అతను డిమాండ్‌ చేశాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ ప్రదర్శనకు బాబర్‌ ఆజమ్‌ బాధ్యత వహించాలని కోరాడు.

అలాగే టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి తిరిగి వచ్చి డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడి గేమ్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవాలని సూచించాడు. బాబర్‌ కింగ్‌ కాదని, అంతా సోషల్‌ మీడియా హైప్‌ అని.. టీ20 వరల్డ్‌ కప్స్‌ అతని యావరేజ్‌ నాకంటే తక్కువ ఉందని షాజాద్‌ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌ చెత్త ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయిన పాక్‌, తర్వాత టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి.. సూపర్‌ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా కెనడాపై గెలిచినా.. చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అలా గెలిచినా.. సూపర్‌ 8కు వెళ్తారనే నమ్మకం లేదు. యూఎస్‌ఏ ఐర్లాండ్‌పై ఓడిపోవాలి. అలాగే రన్‌రేట్‌ పాక్‌ కంటే తక్కువ ఉండాలి. అప్పుడే పాక్‌ సూపర్‌కు వెళ్తుంది. మరి బాబర్‌ కింగ్‌ కాదు అంతా సోషల్‌ మీడియా హైప్‌ అంటూ అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి