iDreamPost

SA vs AFG: వీడియో: వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఎమోషనల్ అయిన సఫారీ దిగ్గజం!

ఆఫ్గానిస్తాన్ ను ఓడించి.. తమ టీమ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడంతో కామెంట్రీ బాక్స్ లోనే ఎమోషనల్ అయ్యాడు సఫారీ దిగ్గజ బౌలర్. ఈ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్తాన్ ను ఓడించి.. తమ టీమ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడంతో కామెంట్రీ బాక్స్ లోనే ఎమోషనల్ అయ్యాడు సఫారీ దిగ్గజ బౌలర్. ఈ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

SA vs AFG: వీడియో: వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఎమోషనల్ అయిన సఫారీ దిగ్గజం!

‘చోకర్స్’.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు సౌతాఫ్రికా. అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ.. ఆవగింజంత అదృష్టం లేదు ఆ జట్టుకు. అందుకే ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ కు చేరుకోలేకపోయింది. దాంతో చోకర్స్ అనే ముద్రను వేసుకుంది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆ ముద్రను చెరిపేస్తూ.. ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో ఆఫ్గానిస్తాన్ ను 9 వికెట్లతో చిత్తు చేసి.. సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక ఈ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ఎమోషనల్ అయ్యాడు.

ఆఫ్గానిస్తాన్ ను ఓడించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది సౌతాఫ్రికా టీమ్. ఆఫ్గాన్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప టార్గెట్ ను 8.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. తమ జట్టు విజయం సాధించడంతో.. ఈ మ్యాచ్ కు కామెంటేటర్స్ గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్లు షాన్ పొల్లాక్, డేల్ స్టెయిన్ లు భావోద్వేగానికి గురైయ్యారు. షాన్ పొల్లాక్ సౌతాఫ్రికా విజయాన్ని తనదైనశైలిలో వర్ణిస్తూ ఉండగా.. పక్కనే ఉన్న స్టెయిన్ ఎమోషనల్ అయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. తన సంతోషాన్ని తెలియపరిచాడు.

కాగా.. 2015 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలు అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మ్యాచ్ ఓడిపోవడంతో గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు స్టెయిన్. ఇక ఇన్నేళ్ల తర్వాత సెమీస్ లో విజయం సాధించి.. ఫైనల్ కు చేరడంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న స్టెయిన్ ఎమోషనల్ అయ్యాడు. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో ఓడిపోయిన వీడియోలను, ఈ మ్యాచ్ లో గెలిచిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. 1992 నుంచి సెమీస్ లోనే ఇంటిదారి పడుతున్న ప్రోటీస్ టీమ్.. వరల్డ్ కప్ ను చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి