iDreamPost

కీలకమైన మ్యాచ్ కి ఇలాంటి మైదానమా?.. అఫ్గాన్‌ కోచ్‌ అసంతృప్తి!

Jonathan Trott: టీ-20 ప్రపంచకప్ లో అసాధారణమై పోరాటం చేసి.. ఆఫ్గానిస్థాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, సెమీఫైనల్ మాత్రం ఆ జట్టు చేతులెత్తేసింది. ఇది ఇలా ఉంటే.. ఆఫ్గాన్ కోచ్ ఈ మైదానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jonathan Trott: టీ-20 ప్రపంచకప్ లో అసాధారణమై పోరాటం చేసి.. ఆఫ్గానిస్థాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, సెమీఫైనల్ మాత్రం ఆ జట్టు చేతులెత్తేసింది. ఇది ఇలా ఉంటే.. ఆఫ్గాన్ కోచ్ ఈ మైదానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కీలకమైన మ్యాచ్ కి ఇలాంటి మైదానమా?.. అఫ్గాన్‌ కోచ్‌ అసంతృప్తి!

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్ 2024  ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన చిన్న జట్లు బలమైన టీమ్ లను ఓడించి.. సూపర్-8 చేరుకున్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి పెద్ద దేశాలను ఓడించి..చిన్న దేశాలు ముందడుగు వేశాయి. వీటిలో ఆఫ్గానిస్తాన్ ప్రదర్శన అయితే అందరిని అబ్బుర పరిచింది. ఆస్ట్రేలియ లాంటి బలమైన జట్టును ఓడించి.. సెమిపైనల్ కి చేరుకుంది. అయితే గురువారం సౌతాఫ్రికా తో జరిగిన సెమి ఫైనల్ లో దారుణమైన ఓటమిని చవిచూసింది. కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ జరిగిన మైదానంపై ఆఫ్గానిస్తాన్ కోచ్ అసహనం వ్యక్తం చేశారు.

టీ-20 ప్రపంచకప్ లో అసాధారణమై పోరాటం చేసి.. ఆఫ్గానిస్థాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లాంటి బలమైన జట్లను ఓడించి.. సగర్వంగా సెమీఫైనల్ కి వెళ్లింది. దీంతో వారి దేశంలో ప్రతి వీధిలో పండగ వాతావరణం కనిపించింది. ఇదే కసితో సెమీ ఫైనల్ కూడా  సౌతాఫ్రికా మీద పోరాడి ఫైనల్ కి వెళ్తుందని ఆశించారు. అయితే గ్రూప్ దశల్లో అన్ని బలమైన దేశాలను ఖంగుతినిపించి.. సెమీఫైనల్ కి వచ్చిన ఆఫ్గానిస్తాన్ జట్టు.. ఇక్కడ చేతులెత్తేసింది. కేవలం 56 పరుగుకే ఆలౌటైంది. ఇందులో  ఎక్స్ ట్రా పరుగులే 13 ఉండటం విశేషం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఇదే  అత్యుల స్కోరు. ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 9 వికెట్ల భారీ తేడా విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్-2024లో అఫ్గాన్‌ జర్నీ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్‌.. జొనాథన్‌ ట్రాట్‌ స్పందించారు.

ఈ సెమీపైనల్ మ్యాచ్ జరిగిన మైదానం ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌కు ఇలాంటి మైదానాన్ని ఎంపిక చేయడం సరైంది కాదని, తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్ లో తాము ఓడిపోయమనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలిపారు. సెమీఫైనల్‌ లాంటి మ్యాచ్‌కు ఈ మైదానం సరికాదని, సింపుల్‌గా చెప్పాలంటే.. ఇరుజట్ల మధ్య పోటీ న్యాయమైన ఆట సాగాలని పేర్కొన్నారు. స్పిన్నర్లకు, సీమర్లకు అనుకూలంగా లేకుండా.. పిచ్‌  అనుకూలంగా ఉండాలని తాను అనడం లేదని, కానీ బంతిని ఆడేందుకు బ్యాటర్‌ ఎంత కష్టపడ్డాడో ఈ మ్యాచ్‌ చూసిన  ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని తెలిపాడు. ఇరు జట్లకూ ఈ పిచ్‌ ఇబ్బందికరంగానే ఉందని వెల్లడించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమ జట్టు స్వల్ప స్కోరు చేయడంతో విజయం సౌతాఫ్రికా వశమైందని అంతే తప్ప ఈ మ్యాచ్‌లో అసలైన పోరు జరగలేదని ఆఫ్గాన్ కోచ్ ట్రాట్‌ వ్యాఖ్యానించారు. మొత్తంగా సెమీ ఫైనల్ లో ఘోర పరాజయంతో ఆఫ్గాన్ టీమ్ తీవ్రంగా నిరాశ చెందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి