Nidhan
India vs England: సెమీస్‌కు ముందు టీమిండియాకు కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలంటే ఆ ఒక్కడ్ని ఆపితే సరిపోతుందని అన్నాడు.
India vs England: సెమీస్‌కు ముందు టీమిండియాకు కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలంటే ఆ ఒక్కడ్ని ఆపితే సరిపోతుందని అన్నాడు.
Nidhan
అప్పుడెప్పుడో అరంగేట్ర టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అది జరిగి 17 ఏళ్లు కావొస్తోంది. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఎన్నో ప్రపంచ కప్‌లు జరిగాయి. కానీ ఒక్కదాంట్లో కూడా భారత్ విజేతగా నిలవలేదు. పలుమార్లు సెమీస్, ఫైనల్స్‌కు వెళ్లినా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగొచ్చింది. టీమ్‌పై భారీగా అంచనాలు పెరిగిపోవడంతో పాటు తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక మన జట్టు నాకౌట్ మ్యాచెస్‌లో చిత్తవుతూ వస్తోంది. సెమీస్ వరకు అలవోకగా చేరుకుంటున్నా.. ఆ స్టేజ్‌ను దాటి కప్పు కైవసం చేసుకోవడంలో తడబడుతోంది. టీ20 వరల్డ్ కప్-2022లో కూడా ఇదే విధంగా తడబడి కప్పును కోల్పోయింది. నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. అయితే ఇప్పుడు మెన్ ఇన్ బ్లూ ముందు గోల్డెన్ ఛాన్స్. మళ్లీ అదే ఇంగ్లీష్ టీమ్‌తో సెమీస్‌లో తలపడనుంది.
పొట్టి కప్పు సెమీస్. మళ్లీ ఇంగ్లండ్‌తోనే మ్యాచ్. దీంతో రివేంజ్ తీర్చుకునేందుకు రోహిత్ సేనకు లక్కీ ఛాన్స్ దొరికింది. అయితే ఇదంత ఈజీ కాదు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరాలంటే భారత్ ఒత్తిడిని అధిగమించాలి. అలాగే స్వేచ్ఛగా ఆడాలి. అప్పుడు గానీ విజయం దరిచేరదు. ముఖ్యంగా ఆ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ అడ్డు తొలగించాలి. అతడు ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. పొట్టి కప్పులో 191 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో యూఎస్ఏ మీద 38 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులో కుదురుకుంటే సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే బట్లర్‌ను ఆపకపోతే భారత్‌కు కష్టమే. మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కప్పు కొట్టాలంటే బట్లర్‌ను భారత్ ఆపి తీరాల్సిందేనని దినేష్ కార్తీక్ అన్నాడు. అతడు క్రీజులో సెటిలైతే మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని రోహిత్ సేనను హెచ్చరించాడు. ‘ఒకవేళ బట్లర్ గనుక క్రీజులో కుదురుకున్నాడా చాలా డేంజరస్‌గా మారతాడు. అతడ్ని 10 బంతుల్లోపే ఔట్ చేయాలి. ఆ మార్క్‌ను గనుక దాటితే అతడ్ని ఆపలేం. గ్రౌండ్ నలుమూలలా భిన్నమైన షాట్లు కొడుతూ పరుగులు పిండుకోగల సిద్ధహస్తుడతను. బట్లర్ లాంటి బ్యాటర్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడికి ఫీల్డ్ సెట్ చేయడం కూడా ఈజీ కాదు. ఇదే అతడ్ని మిగతా వారి కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది’ అని డీకే చెప్పుకొచ్చాడు. కెప్టెన్ కాబట్టి బట్లర్ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేస్తున్నాడని, ఎన్నో కఠిన మ్యాచుల్లో ఇంగ్లండ్‌ను అతడు గట్టున పడేశాడని గుర్తుచేశాడు. ప్రస్తుత క్రికెట్లో ఉన్న బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్స్‌తో బట్లర్ ముందంజలో ఉంటాడని డీకే వ్యాఖ్యానించాడు. మరి.. బట్లర్ గండాన్ని దాటి భారత్ ఫైనల్‌కు చేరుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Dinesh Karthik ” If Jos Buttler gets going,We are talking about the first 10 balls.If he crosses that mark,he is someone who can play to any part of the field,Players like him are very difficult to bowl & set fields & that’s what makes him really special”pic.twitter.com/VEGnBVD9MO
— Sujeet Suman (@sujeetsuman1991) June 27, 2024