iDreamPost

టీమిండియా ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ మొదలవక ముందే!

  • Published Jun 27, 2024 | 6:04 PMUpdated Jun 27, 2024 | 6:04 PM

T20 World Cup 2024 Semifinal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్​గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లకు బ్యాడ్ న్యూస్.

T20 World Cup 2024 Semifinal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్​గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లకు బ్యాడ్ న్యూస్.

  • Published Jun 27, 2024 | 6:04 PMUpdated Jun 27, 2024 | 6:04 PM
టీమిండియా ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్ మొదలవక ముందే!

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్​గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మొదటి సెమీఫైనల్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తుగా ఓడించి తుదిపోరుకు బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది సౌతాఫ్రికా. దీంతో ఇంకో ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకోవాలని క్రికెట్ లవర్స్​ ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ పోరుకు ఆతిథ్యం ఇస్తున్న గయానా పిచ్ ఎలా స్పందిస్తుంది? ఎవరికి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది? మ్యాచ్​ను ఎవరు మలుపు తిప్పుతారు? అనే అంశాలపై అభిమానులు డిస్కస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫ్యాన్స్​కు ఓ బ్యాడ్ న్యూస్.

భారత్-ఇంగ్లండ్ నాకౌట్ ఫైట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్ మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్​కు హోస్ట్​గా ఉన్న గయానా స్టేడియం దగ్గర జోరున వర్షం కురుస్తోంది. టాస్​కు ఇంకా 2 గంటల టైమ్ కూడా లేదు. దీంతో వరుణుడు శాంతిస్తాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్​కు రిజర్వ్ డే కూడా లేదు. కాబట్టి వాన వల్ల మ్యాచ్ రద్దయితే ఏంటని అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్-8 దశలో టేబుల్ టాపర్​గా ఉన్న టీమిండియా ఫైనల్​కు చేరుతుంది.

మ్యాచ్ రద్దయితే తమ జట్టు మెగాటోర్నీ నుంచి ఇంటిదారి పట్టే ప్రమాదం ఉండటంతో వర్షం ఆగాలని ఇంగ్లీష్ టీమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ్యాచ్ జరగాలని, లేకపోతే తమ ఆశలు గల్లంతు అవుతాయని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు భారత​ అభిమానులు మాత్రం మ్యాచ్ జరిగినా, జరగకపోయినా ఫైనల్ చేరేది రోహిత్ సేనేనని బల్ల గుద్ది చెబుతున్నారు. రద్దయితే గ్రూప్ టాపర్​గా తుదిదశకు చేరుతుందని.. ఒకవేళ మ్యాచ్ సాధ్యమైతే ఇంగ్లండ్​ను చిత్తు చేసి టైటిల్ ఫైట్​కు క్వాలిఫై అవుతుందని ధీమాగా చెబుతున్నారు. మరి.. భారత్-ఇంగ్లండ్ పోరు కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి