iDreamPost
android-app
ios-app

ఆ ప్లేయర్ కోసం స్కెచ్ రెడీ చేశాం.. భారత్ పనైపోయినట్లే: ఇంగ్లండ్ కోచ్

  • Published Jun 27, 2024 | 5:48 PM Updated Updated Jun 27, 2024 | 5:48 PM

India vs England: సరిగ్గా సెమీస్​కు ముందు భారత్​కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ టీమిండియా స్టార్ కోసం స్కెచ్ రెడీ చేశామని.. ఇక పనైపోయినట్లేనని హెచ్చరించాడు.

India vs England: సరిగ్గా సెమీస్​కు ముందు భారత్​కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ టీమిండియా స్టార్ కోసం స్కెచ్ రెడీ చేశామని.. ఇక పనైపోయినట్లేనని హెచ్చరించాడు.

  • Published Jun 27, 2024 | 5:48 PMUpdated Jun 27, 2024 | 5:48 PM
ఆ ప్లేయర్ కోసం స్కెచ్ రెడీ చేశాం.. భారత్ పనైపోయినట్లే: ఇంగ్లండ్ కోచ్

టీ20 వరల్డ్ కప్​లో మోస్ట్ ఎగ్జయిటెడ్ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​కు ఫేవరెట్లలో ఒకటైన భారత్​కు మధ్య ఇవాళ నాకౌట్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన జట్టు ఫైనల్​కు క్వాలిఫై అవుతుంది. రెండు టీమ్స్ గెలవాలనే కసితో ఉన్నాయి. సెమీస్​లో చెలరేగి ఆడే అలవాటు ఉన్న బట్లర్ సేన.. మళ్లీ అదే రిపీట్ చేయాలని చూస్తోంది. టీ20 ప్రపంచ కప్-2022లో టీమిండియాకు నాకౌట్ పంచ్ ఇచ్చింది. దాన్నే మళ్లీ పునరావృతం చేయాలని చూస్తోంది. మరోవైపు 2022 సెమీస్ గాయాన్ని మర్చిపోని రోహిత్ సేన.. ఈసారి ఇంగ్లండ్​పై పగ తీర్చుకోవాలని భావిస్తోంది. ఆ జట్టును చిత్తుగా ఓడించి రివేంజ్ తీర్చుకోవడంతో పాటు ఫైనల్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటోంది.

నాకౌట్ ఫైట్​కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ మైండ్​గేమ్ మొదలుపెట్టాడు. ఈసారి కూడా తమదే గెలుపంటూ భారత్​ను రెచ్చగొట్టాడు. టీమిండియాను ఓడించే కిటుకు తమకు తెలుసునని చెప్పాడు. బట్లర్​తో పాటు ఆ టీమ్ హెడ్ కోచ్ మాథ్యూ మాట్​ కూడా టీమిండియాను రెచ్చగొట్టాడు. సెమీస్ కోసం ఫుల్​గా ప్రిపేర్ అయ్యామని తెలిపాడు. ముఖ్యంగా కీలక బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్స్​తో రెడీగా ఉన్నామని పేర్కొన్నాడు మాట్. అతడి కోసం వ్యూహాలను సిద్ధం చేశామని.. ఇక భారత్ పనైపోయినట్లేనని వార్నింగ్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా కోహ్లీ టాప్ క్లాస్ బ్యాటింగ్​తో ఆకట్టుకుంటున్నాడని మెచ్చుకున్నాడు. సెమీస్​లో టీమిండియాకు అతడే కీలకమని చెప్పాడు. బిగ్ మ్యాచెస్​లో ఎలా ఆడాలో విరాట్​కు తెలుసునన్నాడు ఇంగ్లండ్ కోచ్.

‘గత కొన్నేళ్లుగా పరుగులు వరద పారిస్తూ విరాట్ కోహ్లీ తన క్లాస్​ను చూపిస్తున్నాడు. భారత జట్టులో అతడు చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడో బిగ్ ప్లేయర్. తనదైన రోజున కోహ్లీ ఎంత భీకరంగా ఆడతాడో మాకు బాగా తెలుసు. మ్యాచ్​ను ఒంటిచేత్తో లాక్కోగల సామర్థ్యం అతడికి ఉంది. అతడు చాలా స్మార్ట్​గా రన్స్ రాబడతాడు. అందుకే అన్ని విధాలుగా కోహ్లీని ఆపేందుకు ప్రిపేర్ అయ్యాం. అతడి కోసం స్కెచ్ రెడీ చేశాం’ అని మాథ్యూ మాట్ స్పష్టం చేశాడు. ఈ వరల్డ్ కప్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడుతున్న తీరు అద్భుతమని ఇంగ్లండ్ కోచ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. బ్యాట్​తో రాణించడమే గాక సారథిగానూ హిట్​మ్యాన్​ తన మార్క్ చూపిస్తున్నాడని తెలిపాడు. అతడి సారథ్యంలోని భారత్​ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని.. కానీ ఈ ఛాలెంజ్​కు తాము రెడీగా ఉన్నామని వివరించాడు. మరి.. కోహ్లీ మీద ఇంగ్లండ్​ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.