iDreamPost
android-app
ios-app

Lenin: లెనిన్ – ఒక్క విడియో మార్చేసిందా?

ఏ సినిమా అయినా సరే, అవుట్ రేట్ గా నెగిటివ్ టాక్ వస్తే ఇక దాన్ని ఎవరూ రక్షించలేదు.

ఏ సినిమా అయినా సరే, అవుట్ రేట్ గా నెగిటివ్ టాక్ వస్తే ఇక దాన్ని ఎవరూ రక్షించలేదు.

Lenin: లెనిన్ – ఒక్క విడియో మార్చేసిందా?

ఏ సినిమా అయినా సరే, అవుట్ రేట్ గా నెగిటివ్ టాక్ వస్తే ఇక దాన్ని ఎవరూ రక్షించలేదు. అదే కనుక డివైడ్ టాక్ వచ్చినా, ఇటు కొందరు, అటు కొందరు నిలబడి బాగుందని కొందరు, బాలేదని కొందరు అంటే ఏదో ఒకటి చేసి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయచ్చు. ఒక్కోసారి ఏదో ఒక అద్భుతం జరుగుతుంటుంది. అప్పుడు ఇక అటు ఇటు లాగిన సినిమా కూడా సర్రున ముందుకు దూసుకుపోతుంది.

అఖిల్ లెనిన్ సినిమా విషయంలో ఇదే జరిగిందేమో? సినిమా విడుదలైన వెంటనే దాదాపు ఇండస్ట్రీ అంతా తెరచాటున పెదవి విరిచేసారు. మీడియా కూడా 2.5 నుంచి 2.75 వరకు మాత్రమే రేటింగ్ ఇవ్వగలిగింది. ఫస్ట్ హాఫ్ కు యునానిమస్ నెగిటివ్ వచ్చింది. సెకండాఫ్ బాగుంది అన్నారు. అసలు ఓపెనింగ్ నే డల్ గా తీసుకుంది. ఇంత పబ్లిసిటీ జరిగినా ఎందుకిలా డల్ ఓపెనింగ్ అనుకున్నారు. ఉదయాన్నే వేసిన స్పెషల్ షో లు కూడా ఫుల్ కావడం కష్టం అయింది. మ్యాట్నీలు అలాగే వున్నాయి. ఫస్ట్ షో లు అలాగే వున్నాయి.

ఇలాంటి టైమ్ లో ఓ విడియో బయటకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలో కేక్ కటింగ్. హీరో అఖిల్ భావోద్వేగంతో అందరి ముందు తండ్రి నాగార్జున కాళ్లకు మొక్కి, గట్టిగా కౌగిలించుకోవడం. తండ్రి అతనిని అనునయించడం. ఆ విడియో మామూలు వైరల్ కాలేదు. ప్రతి ఛానెల్, యూ ట్యూబ్ ఛానెల్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇలా ప్రతి మాధ్యమం దాన్ని వైరల్ చేసేసాయి. అసలే అఖిల్ కు హిట్ పడలేదు ఇంత వరకు అనే చిన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో వుంది. ఫ్యాన్స్ లో ఆ ఆవేదన ఇంకా ఎక్కువ వుంది.పైగా అక్కినేని ఫ్యామిలీ అంటే ఓ ఆభిమానం ఇప్పటికీ ఫిక్స్ డ్ గా వుంది. దాంతో జనాలకు సింపతీ మామూలుగా జనరేట్ కాలేదు.

నిర్మాత నాగవంశీ చెప్పినట్లు, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో కలిపి ఎంత వసూలు చేసాయో, సెకెండ్ షో ఒక్కటీ అంత వసూలు చేసింది. దీని వెనుక ఆ వైరల్ విడియో హెల్ప్ ఎంతో కొంత వుందని అనుకోక తప్పదు. ఇలా అంటే నిర్మాతలు లేదా అభిమానులు ఒంటి కాలి మీద చేసి, అంతా సింపతీ చేసిందా? సినిమాలో విషయం లేదా అని అనొచ్చు. సినిమా ఫ్లాపు టాక్ రాలేదు..యావరేజ్ టాక్ వచ్చింది. దానికి ఈ సింపతీ తోడయింది అని అనుకోవడానికి అయితే ఆస్కారం వుంది. పైకి ఓపెన్ గా అలా అనకపోయినా ఆఫ్ ది రికార్డుగా ఇండస్ట్రీ జనాలు అంటున్న మాట అదే. పైగా గతంలో ఇలా సింపతీ వర్కవుట్ అయిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తున్నారు.

గమత్తేమిటంటే ముందు రోజు హీరో అఖిల్ భావోద్వేగానికి గురయితే, మర్నాడు హీరోయిన్ భాగ్యశ్రీ, నిర్మాత నాగార్జున కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ భాగ్యశ్రీ అయితే స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి లెనిన్ ఫస్ట్ వీకెండ్ లో ముందుకు దూసుకుపోయింది. అఖిల్ కు హిట్ వచ్చింది. నాగవంశీ లక్కీ హ్యాండ్ అని సెటిల్ అయింది. ఎలా అయితేనేం అదే కదా కావాల్సింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş