సాహో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినా త్వరగా పూర్తి చేద్దామనుకుంటే ఆ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దాని వల్లే జార్జియా నుంచి షెడ్యూల్ ని అర్ధాంతరంగా ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ కొనసాగుతుందో నిర్మాతకు కూడా తెలియదు. ఇదిలా ఉండగా దీని తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు ఫిలిం […]
సాహో తర్వాత బాహుబలి తరహాలో ఎక్కువ రోజులు వెయిట్ చేయాలేమో అని దిగులు చెందుతున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు రాధాకృష్ణ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. తన దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించేశారు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం అనుకున్న టైం కంటే త్వరగా తిరిగి […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూలై నుంచి ఫ్రీ అయిపోతాడు. తర్వాత దాని ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంటుంది కాని మరీ నెలల తరబడి అయితే అవసరం ఉండదు. అక్టోబర్ నుంచి పబ్లిసిటీ ఉదృతంగా జరిగేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. కాని దీని తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడనే క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. సాహోతో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసిన సుజిత్ వైపు […]
బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ అయిపోయిన డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ మంచి స్పీడ్ తో జరుగుతోంది. ప్రపంచమంతా కోవిడ్ వైరస్ భయంతో వణికిపోతుంటే యూనిట్ భయపడకుండా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని తెలిసింది. తాజాగా మరో థ్రిల్లింగ్ అప్ డేట్ లీకైపోయింది. దాని ప్రకారం ఇందులో హీరోయిన్ పూజాహెగ్డే యువరాణి పాత్రను పోషిస్తోందని సమాచారం. యూరోప్ […]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరియు మొదటగా విడుదలయ్యేది పింక్ రీమేకే కానీ అందరి దృష్టి తర్వాత రాబోయే క్రిష్ మూవీ మీదే ఉంది. విభిన్నమైన కథలతో లిమిటెడ్ బడ్జెట్ తోనే రిచ్ మేకింగ్ తో మెప్పించే క్రిష్ ఇప్పుడు పవన్ తో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. తెలంగాణ యోధుడు పండగ సాయన్న కథని కూడా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇందులో రెండు కీలక పాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నట్టు సమాచారం. […]
బాహుబలి కోసం నాలుగేళ్లు సాహో కోసం రెండేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ తో ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందాకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు ఎవరో కూడా చెప్పేశారు. మహానటితో తన సత్తాను చాటిన నాగ అశ్విన్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హీరొయిన్ […]
ఈ పోకడ గమనిస్తే మనవాళ్ళకు పక్క చూపులు ఎక్కువయ్యాయి. అంటే ఇతర రాష్ట్రాల్లో డబ్బింగ్ రూపంలోనో లేదా మల్టీ లాంగ్వేజ్ లోనో సినిమాలు వదిలి కాస్త ఎక్కువ డబ్బు చేసుకుందామనే ఆలోచన ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ విషయంలో మూడు సార్లు దెబ్బ తిన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో సహా అన్ని వెర్షన్లు బోల్తా కొట్టాయి. చిరంజీవి సైరా ఇక్కడే ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తే […]
డార్లింగ్ ప్రభాస్ ఒకప్పుడేమో కానీ బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ అయిపోయాడు. దేశం నలుమూలలా గుర్తింపు వచ్చేసింది. చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల వల్ల సాధ్యం కాని స్టార్ ఇమేజ్ ని ప్రభాస్ ఒక్క సినిమాతోనే సంపాదించుకున్నాడు. ఈ కారణంగానే సాహో సౌత్ లో డిజాస్టర్ గా నిలిచినా నార్త్ లో దీనికి మంచి లాభాలు వచ్చాయి. అక్కడి ప్రేక్షకులు బాగానే చూసి హిట్ అనిపించారు. అయితే దీనికి ఇంకో ఘనత […]
టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. మొన్నటి దాకా బాహుబలి లాంటి సినిమాలతోనే వంద కోట్ల మార్కు సాధ్యమనే లెక్కలను తారుమారు చేస్తూ రంగస్థలం, సాహో, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీస్ సైతం ఆ మార్కును అలవోకగా అందుకోవడంతో ఓవర్సీస్ లోనూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి లాంటి ఆల్ టైం డిజాస్టర్ తోనూ అరవై కోట్ల దాకా వసూళ్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ మీదే ఇప్పుడు అందరి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్ (రిజిస్టర్ చేసిన టైటిల్) షూటింగ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో పారలల్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోయిన్లు ఫిక్స్ అయ్యారట. ఒకరు జాక్వలిన్ ఫెర్నాండేజ్ కాగా మరొకరు దిశా పటాని. జాక్వలిన్ ఇటీవలే ప్రభాస్ సాహోలో స్పెషల్ సాంగ్ తో మెరిసిన సంగతి తెలిసిందే. దిశా పటానికి ఇది రెండో మెగా సినిమా. […]