iDreamPost
android-app
ios-app

గజినీ ఫార్ములాతో 18 పేజెస్ ?

  • Published Mar 29, 2020 | 12:56 PM Updated Updated Mar 29, 2020 | 12:56 PM
  • Published Mar 29, 2020 | 12:56 PMUpdated Mar 29, 2020 | 12:56 PM
గజినీ ఫార్ములాతో 18 పేజెస్ ?

చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చి హీరో నిఖిల్ తో పాటు నిర్మాత ఠాగూర్ మధుని విపరీతమైన టెన్షన్ కు గురి చేసిన అర్జున్ సురవరం ఎట్టకేలకు గత ఏడాది విడుదలై కమర్షియల్ లెక్కల్లో మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. కిరాక్ పార్టీ షాక్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు కోరుకున్న ఫలితాన్నే ఇచ్చింది. దీని తర్వాత నిఖిల్ సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణంలో 18 పేజెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అఫీషియల్ గా ప్రకటించారు కూడా.

కరోనా ప్రభావం లేకపోతే ఈ పాటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయేది. అయినా యూనిట్ ఖాళీగా లేదు. దర్శకుడు సూర్య ప్రతాప్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ వీడియో కాలింగ్ ద్వారా రెగ్యులర్ డిస్కషన్స్ లో ఉన్నారు. ట్యూన్స్ ఖరారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ ని తీసుకున్నట్టుగా టాక్ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని ఇన్ సైడ్ టాక్. తాజాగా వస్తున్న మరో లీక్ ప్రకారం నిఖిల్ ఇందులో మెమరీ లాస్ యూత్ గా కనిపిస్తాడట. అంటే గజినీలో సూర్య టైపులో అన్న మాట. అయితే అందులోలా భారీగా భీకరంగా కాకుండా చాలా స్టైలిష్ గా డిఫరెంట్ పాయింట్ తో ఇది రూపొందుతోందని చెబుతున్నారు.

ఓ యువకుడి జీవితానికి సంబంధించిన డైరీలోని 18 పేజీలలో ఏం జరిగిందన్న కాన్సెప్ట్ తో ఇది రూపొందించబోతున్నట్టు చెబుతున్నారు. కుమారి 21 ఎఫ్ తో డెబ్యూ తోనే ఆకట్టుకున్న సూర్య ప్రతాప్ ఇప్పుడీ 18 పేజెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సుకుమార్ టీమ్ లో మొదటిసారి దేవిశ్రీప్రసాద్ కాకుండా బయటి నుంచి గోపి సుందర్ ని తీసుకున్నారు. దానికి కారణం గీతా ఆర్ట్స్ 2 అని తెలుస్తోంది. గీత గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లతో పాటు దీనికి కూడా ముందస్తుగానే అగ్రిమెంట్ జరిగిందట. మొత్తానికి వెరైటీ టైటిల్ తో 18 పేజెస్ నిర్మాణ దశలోనే ఆసక్తి రేపుతోంది.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş