iDreamPost
android-app
ios-app

చిరు VS బాలయ్య – మళ్ళీ పోరు తప్పదా

  • Published Mar 12, 2020 | 12:34 PM Updated Updated Mar 12, 2020 | 12:34 PM
చిరు VS బాలయ్య  – మళ్ళీ పోరు తప్పదా

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ బరిలో చాలా సార్లు తలపడిన మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలకృష్ణల మధ్య మరోసారి బాక్స్ ఆఫీస్ పోరు తప్పేలా లేదని పరిశ్రమ వర్గాల కథనం. తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి దీన్ని దసరాకు విడుదల చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక పాత్ర మహేష్ బాబు చేస్తాడా లేక రామ్ చరణ్ కనిపిస్తాడా అనే విషయం తేలకముందే డేట్ ఫిక్స్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. షూటింగ్ అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా చకచకా జరిగిపోతోంది.

ఇదిలా ఉండగా బోయపాటి శీను-బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీని కూడా దసరాకే రిలీజ్ చేయాలనే ఆలోచన టీంలో ఉన్నట్టు వినికిడి. వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ఉంది కాబట్టి దానికి అనవసరంగా పోటీకి వెళ్తే వసూళ్ళ పరంగా లేనిపోని ఇబ్బంది తలెత్తుతుంది. అందుకే దసరాకు ఎలాగూ సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని వాడుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ హీరోల చివరి క్లాష్ 2017లో జరిగింది. ఖైదీ నెంబర్ 150 – గౌతమిపుత్ర శాతకర్ణి ఒక్క రోజు తేడాతో తలపడ్డాయి. రెండూ విజయాలు సాధించాయి కానీ కమర్షియల్ లెక్కల్లో చిరునే అప్పర్ హ్యాండ్ సాధించాడు.

అంతకు ముందు అధిక శాతం బాలయ్యనే విజేతగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. మాస్ హీరోలను డీల్ చేయడంలో ఎవరికి వారు ప్రత్యేకమైన శైలి కలిగిన కొరటాల శివ-బోయపాటి శీనులు తలపడటం ఆసక్తిని రేపుతోంది, కొరటాల శివ క్లాస్ టచ్ తోనే మాస్ ను కూడా ఆకట్టుకుంటూ ఫెయిల్యూర్ లేకుండా సాగుతున్నాడు. బోయపాటి శీనుకి వినయ విధేయ రామ ఇచ్చిన షాక్ చిన్నది కాదు. అందుకే బాలయ్య సినిమాని సింహా-లెజెండ్ ని మించే స్థాయిలో ఇవ్వాలని కసిమీదున్నాడు. ఏదైతేనేం అనుకున్న టైంలోనే ఈ రెండు సినిమాల షూటింగులు పూర్తి చేసుకుంటే మరోసారి సీనియర్ స్టార్ హీరోల యుద్ధం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş