iDreamPost
android-app
ios-app

Tollywood: తెరపైకి మళ్లీ పర్సంటేజ్ వివాదం

  • Published Jul 07, 2026 | 10:31 AM Updated Updated Jul 07, 2026 | 10:31 AM

పెద్ది సినిమా ముందు తెగ హడావుడి జరిగింది పర్సంటేజ్ విధానం మీద. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని తాత్కాలికంగా సద్దుమణిగించారు.

పెద్ది సినిమా ముందు తెగ హడావుడి జరిగింది పర్సంటేజ్ విధానం మీద. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని తాత్కాలికంగా సద్దుమణిగించారు.

Tollywood: తెరపైకి మళ్లీ పర్సంటేజ్ వివాదం

పెద్ది సినిమా ముందు తెగ హడావుడి జరిగింది పర్సంటేజ్ విధానం మీద. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని తాత్కాలికంగా సద్దుమణిగించారు. తనకు కొంచెం సమయం ఇవ్వమని, ఈసారి వాయిదా లేకుండా పరిష్కరించేద్దామని చెప్పారు. దాంతో ఎగ్జిబిటర్లు వెనక్కు తగ్గారు. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. దాంతో నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా సమావేశం అయ్యారు. వీరిలో కొందరు వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ మేరకు చర్చించి, తనకు ఓ వారం సమయం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది.

అయితే నిర్మాతల ఆలోచన వేరుగా వుంది. ఓ ఏడాదిన్నర పాటు పర్సంటేజ్ ఆలోచన ను థియేటర్ల పక్కన పెట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఏడాదిన్నరలో ప్రస్తుతం ప్లానింగ్ లో వున్న భారీ, అతి భారీ సినిమాలు అన్నీ అయిపోతాయి. అంటే 2028 నుంచి పర్సంటేజ్ విధానం అమలు చేయచ్చు అన్నది నిర్మాతల ఆలోచన అనుకోవాలి. కానీ అప్పటి వరకు ఆగితే సింగిల్ స్క్రీన్ లు చాలా వరకు మాయం అయిపోతాయి అన్నది ఎగ్జిబిటర్ల మాట.

నిజానికి నిర్మాతల మదిలో కూడా అదే వుండి వుండొచ్చు. మరో ఏడాదిన్నర ఆగితే మల్టీ ప్లెక్స్ లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. అప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ లతో తలనొప్పి వుండదు. మొత్తం మీద ఈ పర్సంటేజ్ వివాదం ఎప్పటికీ సెటిల్ కాదనే అనుకోవాలి. ఇదిలా వుంటే ఆంధ్రతో కలిసి కాకుండా తెలంగాణ వరకు నిర్ణయం తీసేసుకోవాలనే ఆలోచన తెలంగాణ ఎగ్జిబిటర్లలో వుంది. కొందరు పెద్ద ఎగ్జిబిటర్ల ఆలోచన వేరుగా వుంది. అసలు ఈ పర్సంటేజ్ డిమాండ్ వదిలేసి, రెంట్ లు పెంచుకోవడం, రెండో వారం కూడా రెంట్ ల మీద అయితేనే ఆడడం వంటివి చేసుకుంటే బెటర్ అనే ఆలోచన వుంది.

మొత్తం మీద పర్సంటేజ్ వివాదం తేనెతుట్ట మళ్లీ కదిలినా ప్రయోజనం వుంటుందా అన్నది అనుమానం. ఎందుకంటే పెద్ద సినిమాల ముందే ఈ డిమాండ్ పెడితే డిస్కషన్ వుంటుంది. కానీ ప్రతి పెద్ద సినిమాకు ఎవరో ఒకరు అడ్డం పడతారు. మెగా హీరోల సినిమా అయినా, బాలయ్య సినిమా అయినా, ఎన్టీఆర్ సినిమా అయినా, వివాదాన్ని ఆ సినిమాకు వ్యతిరేకం అన్నట్లు టర్న్ చేస్తారు. విషయం పక్కదారి పడుతుంది. అందువల్ల పర్సంటేజ్ విధానం అన్నది ఎప్పటికీ తెలుగు నాట అమలు కావడం కష్టమే అనుకోవాలి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet