వైఎస్సార్ అందరివాడని, కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. ఇచ్చిన మాట నుంచి, ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్సీపీ పుట్టిందని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టారు, వేధించారు, అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు. వైఎస్ జగన్ మాస్ లీడర్. యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి, నేను […]
మనిషికి రక్తం ఎంత ముఖ్యమో, వ్యవసాయానికి సాగునీరు అంతే ముఖ్యం. రైతులు బాగుండాలేంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం సాఫీగా సాగాలంటే నీరు ఉండాలి. నీరు లేనిదే వ్యవసాయం లేదు. ఈ పరిస్థితిని తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో కళ్లారాచూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టేందుకు జలయజ్ఞం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కేవలం మాటల దశలో ఉన్న అనేక ప్రాజెక్టులను, అసాధ్యం అని పూర్వ ముఖ్యమంత్రులు […]
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారా..? అవుననేలా పరిణామాలు జరుగుతున్నాయి. జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రెస్మీట్లు పెడుతూ హల్చల్ చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహారశైలి రాజకీయ నాయకుడుగా ఉందని ఇప్పటికే తేలింది. ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారని స్పష్టమవుతోంది. వైఎస్సార్ కడప […]
రైతే రాజు.. అనే మాటను నిజం చేసేందుకు ప్రయత్నించిన వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతల వృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశానికి అన్నం పెట్టేందుకు అప్పులపాలవుతున్నా కూడా కాడె వదలని రైతన్నకు వెన్ను దన్నుగా నిలబడిన నేత ఎవరని అడిగితే.. ప్రతి రైతు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబుతారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. […]
రాజకీయ, అధికార వర్గాల్లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల వ్యక్తిత్వంపై తరచూ ఓ చర్చ జరుగుతుండేది. ఎన్టీ రామారావు వద్దకు వెళ్లి ఒక రూపాయి అడిగితే.. ఎక్కడ ఉన్నాయ్, అంటూ ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్పేవారట. అదే వైఎస్ వద్దకు వెళ్లి.. రూపాయి అడిగితే.. రూపాయి లేదు. ఇదీ పరిస్థితి. ఈసారికి ఈ పావలాతో సరిపెట్టుకోండని చెప్పేవారట. ఆంధ్రప్రదేశ్ చర్రితలో గుర్తుండిపోయే ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలి ఇలా ఉండేదట. ఎన్టీ రామారావు తన వద్దకు వచ్చిన […]
ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్‌లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు […]
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించున్నారు. మన దేశం కూడా స్తంభించిపోయుంది. పాఠశాలలు, కళాశాలలు పరీక్షల్ని కూడా రద్దు చేసి/వాయిదా వేయడంతో చదువుకునేవాళ్ళు; ఉద్యోగులు సాధ్యమైనంత మంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ఆ వెసులుబాటు లేని వారు లాక్డౌన్ తొలి దశ సడలింపుల తర్వాత కొందరు తమ విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే సోమవారం నుంచి శుక్రవారం/శనివారం దాకా తమ పనుల్లో తీరిక లేని వారు, చిన్న పిల్లలు […]
భారతదేశం సమైక్య స్ఫూర్తి రానురాను కొడగొట్టుకుపోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆదాయాల కోసం కేంద్రం వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను మరింతగా కుదించే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. ఈసారి విద్యుత్ విషయంలో రాష్ట్రాలను పరిమితం చేసేలా కొత్త చట్టం రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ప్రకారం ఇక పవర్ మొత్తం సెంట్రల్ […]
వైవీ సుబ్బారెడ్డి వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైవీ సుబ్బారెడ్డి గా అందరికీ సుపరిచితులైన యర్రం వెంకట సుబ్బారెడ్డి డివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడి గా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి గా వైయస్ జగన్ కాంగ్రెస్ ను వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించినప్పుడు జగన్ మోహన్ రెడ్డి కి అన్ని విధాల అండగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి లో ముఖ్య భూమిక […]
ఇల్లు లేదా ఇళ్ల స్థలం లేని కుటుంబం ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాజాగా ముహూర్తం ఖరారైంది. జూలై 8 వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తాజాగా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు. […]