iDreamPost
android-app
ios-app

బెంగళూరులో TNIT మీడియా అవార్డ్స్ ఈవెంట్‌

  • Published Jul 09, 2025 | 12:16 PM Updated Updated Jul 09, 2025 | 12:16 PM

ది న్యూఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. నేతృత్వంలో సీఈఓ రఘు భట్ ప్రతీసంవత్సరం TNIT మీడియా అవార్డ్స్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మీడియా పట్ల ఉన్న ప్యాషన్‌తో మొదలైన ఈ అవార్డ్స్ వేడుక... ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

ది న్యూఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. నేతృత్వంలో సీఈఓ రఘు భట్ ప్రతీసంవత్సరం TNIT మీడియా అవార్డ్స్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మీడియా పట్ల ఉన్న ప్యాషన్‌తో మొదలైన ఈ అవార్డ్స్ వేడుక... ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

  • Published Jul 09, 2025 | 12:16 PMUpdated Jul 09, 2025 | 12:16 PM
బెంగళూరులో TNIT మీడియా అవార్డ్స్ ఈవెంట్‌

TNIT మీడియా అవార్డ్స్ ఈవెంట్‌ను ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నాము. సౌత్ ఇండియా నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నాం. ప్రతి మీడియా చానెల్ మా టీంకు అప్లికేషన్లు సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరి మద్దతు కోరుతున్నాం: ప్రెస్ మీట్‌లో సీఈఓ రఘు బట్‌

TNIT మీడియా అవార్డ్స్‌కు జ్యూరీగా వ్యవహరించడం ఒక గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. ఎక్స్‌క్లూజివ్‌గా మీడియాకు అందిస్తున్న ఈ అవార్డులు ఫిలింఫేర్ స్థాయికి ఎదగాలని, అందరి మద్దతుతో ఈవెంట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను: జర్నలిస్ట్ ప్రభు

ది న్యూఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. నేతృత్వంలో సీఈఓ రఘు భట్ ప్రతీసంవత్సరం TNIT మీడియా అవార్డ్స్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మీడియా పట్ల ఉన్న ప్యాషన్‌తో మొదలైన ఈ అవార్డ్స్ వేడుక… ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది TNIT మీడియా అవార్డ్స్ ఈవెంట్ ని ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో సిఈవో రఘు బట్ మాట్లాడుతూ.. శుభలేఖ సుధాకర్ గారికి, ఉత్తేజ్ గారికి, మా తెలుగు జ్యూరీ ప్రభు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డులను ప్రారంభించి ఇది ఎనిమిదవ సంవత్సరం. ఈ ఏడాది ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నాం. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నాం. ప్రతి మీడియా ఛానల్ మా టీంకు అప్లికేషన్లు సమర్పించమని కోరుతున్నాం. ఈ గొప్ప కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు’అనంరు

మార్కెటింగ్ హెడ్ ఖుషీ మాట్లాడుతూ.. రఘు గారి విజన్ తో సౌత్ ఇండియా మొత్తానికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి ఛానల్‌కు నామినేషన్ ఫారంలు పంపిస్తాం. వారు పూర్తి చేసి మాకు తిరిగి పంపాలి. తర్వాత జ్యూరీ పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. నటీనటులకు ఐఫా, సైమా లాంటి అవార్డ్స్ ఉన్నట్లే, మీడియాకి కూడా అంతే స్థాయిలో గుర్తింపు రావాలని మేము ఆశిస్తున్నాం. మీడియా రాత్రి పగలు కష్టపడుతూ సమాజానికి సమాచారం అందిస్తున్నారు. వారిని గుర్తించి గౌరవించడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీ అందరి మద్దతు కావాలి’అన్నారు

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒకప్పుడు మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియానే. ఇప్పుడు టీవీ, వెబ్, యూట్యూబ్ ఇలా అనేక ప్లాట్‌ఫారాలుగా విస్తరించింది. మీడియాలో ప్రతి విభాగానికి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన చాలా ప్రత్యేకమైనది. గత ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా ఈ అవార్డ్స్ నిర్వహిస్తూ, ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలని సమన్వయం చేస్తూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించడం ఒక బాధ్యత. నా అనుభవంతో, నిష్పక్షపాతంగా పని చేస్తాను. మీడియాకు అంకితంగా ఇస్తున్న ఈ అవార్డులు ఫిలింఫేర్ స్థాయిలో ఎదుగుతాయని నమ్మకంగా ఉంది. అందరి మద్దతుతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అన్నారు.

యాక్టర్ ఉత్తేజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవార్డు కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రజాస్వామ్యంలో మీడియా ‘ఫోర్త్ ఎస్టేట్’. ఈ అవార్డ్స్ పోర్త్ పిల్లర్ లా అనిపిస్తోంది. తెర ముందు మేము కనిపించడానికి, తెర వెనుక మీడియా ఎంతో శ్రమిస్తోంది. వాళ్లను ముందుకు తీసుకొస్తున్న TNIT సంస్థకు ధన్యవాదాలు. ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అపారమైనది. మీడియాకే ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడం అభినందనీయం. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న TNIT సంస్థకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎనిమిదవ సంవత్సరంలో దక్షిణాది అన్ని భాషల మీడియా వ్యక్తులను గౌరవించడం ఆనందంగా వుంది’అన్నారు.

యాక్టర్ శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. TNIT South Indian Media Awards ప్రెస్ మీట్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. జర్నలిస్టులు, ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ మధ్య వారధిలా ఉంటారు. వారి సేవలను గౌరవించటం చాలా అవసరం. ఈ అవార్డ్స్ ద్వారా జర్నలిస్టులను గుర్తించి సత్కరించడం ఎంతో ఆనందకరం. ఇలాంటి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న TNIT టీంకు ధన్యవాదాలు. జర్నలిస్ట్ మిత్రులకు నా శుభాకాంక్షలు’అన్నారు